Tuesday, October 28, 2025 06:58 AM
Tuesday, October 28, 2025 06:58 AM
roots

అమెరికాకు టూరిస్ట్ వీసా కూడా కష్టమేనా..? వైరల్ అవుతున్న పోస్ట్

అమెరికాలో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీయులకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయులు సైతం ట్రంప్ వ్యవహారశైలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు, ఎవరిని, ఏ రూపంలో బయటకు పంపిస్తారో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నారు ట్రంప్. ఇప్పటికే పలువురు భారతీయులు తిరిగి భారత్ చేరుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే మరికొందరు కూడా తిరిగి దేశానికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read : ఏపీ పోలీస్ భేష్.. మొదటి స్థానంలో తెలంగాణా 

ఇదిలా ఉంచితే.. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలి అనుకున్న వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఎంబసీలో తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చినా సరే తన వీసా రిజెక్ట్ చేసారని, అది కూడా చాలా తక్కువ సమయంలో అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. B1/B2 వీసాతో అతను అమెరికా వెళ్ళాలి అనుకున్నాడు. సాధారణంగా పర్యాటక వీసాగా లేదా వ్యాపారాలను సందర్శించాలి అనుకుంటే ఈ వీసా వర్తిస్తుంది.

Also Read : బీ కేర్ ఫుల్.. పవన్‌కు రోజా వార్నింగ్..!

అసలు ఎక్కడ లోపం ఉందో తనకు చెప్పలేదని.. తన అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఏ మార్గంలో ప్రయత్నం చేయాలో కూడా అర్ధం కాకుండా వీసా రిజెక్ట్ చేసారని చెప్పుకొచ్చాడు. “ఇటీవల అమెరికా రాయబార కార్యాలయంలో నా B1/B2 వీసా ఇంటర్వ్యూ జరిగింది. కేవలం మూడు ప్రశ్నలు వేసిన తర్వాత ఒక నిమిషం లోపు నా వీసా రిజెక్ట్ చేసారని పోస్ట్ చేసాడు. తాను ఫ్లోరిడాకు రెండు వారాల పర్యటన ప్లాన్ చేసుకున్నానని, డిస్నీ వరల్డ్, యూనివర్సల్ స్టూడియోస్, కెన్నెడీ స్పేస్ సెంటర్, మీరు అమెరికాకు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? మీరు భారతదేశం బయట ప్రయాణించారా? మీకు అమెరికాలో ఎవరైనా కుటుంబం లేదా స్నేహితులు ఉన్నారా? అనే ప్రశ్నలను అడిగారు. వీటికి సమాధానం చెప్పినా వీసా రిజెక్ట్ చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్