ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక మార్పులు తెస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చట్టబద్ధమైన ప్రవేశ మార్గాలను పరిమితం చేసేందుకు వర్కౌట్ చేస్తున్న ట్రంప్ సర్కార్.. 75 దేశాల నుండి వలస వీసాల ప్రాసెసింగ్‌ను నిరవధికంగా నిలిపివేసింది. ఈ ఫ్రీజ్ జనవరి 21 నుండి అమల్లోకి వస్తుంది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, తూర్పు ఐరోపాలోని కొన్ని దేశాలకు ఇది వర్తిస్తుంది.
Also Read : కూటమిలో పెద్దల సభ పంచాయితీ..!
పాకిస్తాన్, బంగ్లాదేశ్, సోమాలియా, రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బ్రెజిల్, నైజీరియా, థాయిలాండ్ ప్రభావిత దేశాలలో ఉన్నాయి. ఈ నిర్ణయం అమెరికాలో శాశ్వతంగా నివసించి, పని చేయాలనుకునే వ్యక్తులకు మాత్రమే వర్తిస్తుంది. పర్యాటకులు లేదా తాత్కాలిక కార్మికులకు కాదు అని అంతర్జాతీయ మీడియా తెలిపింది. గత సంవత్సరం నుండి విదేశీయుల విషయంలో కఠిన నియమాలను విధిస్తోంది. ప్రభుత్వ సంక్షేమంపై ఆధారపడే వ్యక్తుల వీసాలపై ట్రంప్ సర్కార్ కఠినంగా ఉంది. ఆర్ధిక భారం పడటంతో వదిలించుకునే దిశగా అడుగులు వేస్తోంది.
Also Read : ఏబీవి రాజకీయ అడుగు: ఒత్తిడి వ్యూహమా లేక స్వతంత్ర ప్రయాణమా?
కానీ విదేశాంగ శాఖ ఇప్పుడు జాతీయత ఆధారంగా వలస వీసాలను పూర్తిగా నిలిపివేయడానికి అవే అధికారాలను వినియోగిస్తోంది. అమెరికా ప్రజల నుండి సంపదను దోచుకునే వారు అమెరికా వలస వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని ట్రంప్ పరిపాలన అంతం చేస్తోంది అంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగోట్ వ్యాఖ్యానించారు. ఈ 75 దేశాల నుండి వలస వీసా ప్రాసెసింగ్ నిలిపివేస్తున్నాం.. అయితే సంక్షేమం, ప్రజా ప్రయోజనాలను పొందే విదేశీ పౌరుల ప్రవేశాన్ని నిరోధించడానికి విదేశాంగ శాఖ ఇమ్మిగ్రేషన్ ప్రాసెసింగ్ విధానాలను రివ్యూ చేస్తున్నట్టు తెలిపారు.

