Sunday, March 22, 2026 11:13 AM
Sunday, March 22, 2026 11:13 AM

అమెరికా బిజినెస్ వీసా అప్లై చేసిన వారికి షాక్..!

వీసాల జారీ విషయంలో అమెరికా సర్కార్ అనుసరిస్తున్న వైఖరి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో భారతీయులు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన వ్యాపార లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పటికీ, అంతర్జాతీయ అనుభవం ఉన్నప్పటికీ అమెరికా వీసా తనకు రిజెక్ట్ చేసారని ఆవేదన వ్యక్తం చేసాడు. స్టార్టప్ నియోసేపియన్ సహ వ్యవస్థాపకుడు ధనంజయ్ యాదవ్ తన అనుభవాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసారు.

Also Read : తెలంగాణా సైనికులకు జనసేనాని బిగ్ షాక్..!

మంగళవారం ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో జరిగిన ఇంటర్వ్యూలో తన వీసా నిరాకరించారని తెలిపారు. తనకు పెట్టుబడిదారులతో మీటింగ్స్ అలాగే భాగస్వామ్యుల కోసం అమెరికా వెళ్ళాల్సి ఉందని, అయినా సరే వీసా రిజెక్ట్ చేసారని చెప్పుకొచ్చారు. నియోసేపియన్‌ లో సన్నిహితుడు, వ్యాపారస్తుడు అయిన అమెరికాకు చెందిన పిక్సిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు కూడా అయిన హరి వలియత్ నుండి తనకు ఆహ్వానం అందినట్లు చెప్పుకొచ్చారు. ఈ సంస్థ 200 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సేకరించింది.

Also Read : చంద్రబాబు సలహదారుగా మళ్లీ ఆయనే..!

తన కంపెనీ స్పాన్సర్ చేసినా వీసా మాత్రం నిరాకరించడం గమనార్హం. తాను గతంలో అమెరికాలో చదువుకున్నానని, జర్మనీలోని బెర్లిన్‌లో పనిచేశానని, ఎక్కువ కాలం అమెరికాలో ఉండే ఉద్దేశం తనకు లేదని యాదవ్ పేర్కొన్నారు. అతని పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది, అనేక మంది స్టార్టప్ వ్యవస్థాపకులు ఇదే ఆందోళన వ్యక్తం చేసారు. వీసా ఇంటర్వ్యూలకు హాజరైన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్