సాక్షి.. పేరుకు మాత్రమే విశ్వసనీయత.. కానీ అందులో రాసే ప్రతి అక్షరం అబద్ధమే. అసలు సాక్షి పునాదులే అక్రమం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాందించిన వేల కోట్లు సాక్షి పుట్టుకకు బీజం వేశాయి. యజమానికే విలువలు లేవు.. ఇక పత్రికకు ఏం ఉంటాయి.. అందులో పని చేసే సిబ్బందికి ఎలా ఉంటాయి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఎండగట్టాయి. ఇంకా చెప్పాలంటే.. రాజన్న రాజ్యంలో అవినీతికి గేట్లు ఎలా తెరిచారో సవివరంగా లెక్కలతో సహా ప్రచురించాయి. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, గనులకు భూ కేటాయింపులు, వాన్ పిక్, ఓఎంసీ, బెరైటీస్, కన్నెధార కొండ, సోంపేట పవర్ ప్రాజెక్టు, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దోపిడీ, చనిపోయిన వారి పేరుతో పింఛన్లు, కాంట్రాక్టులు.. ఇలా ఒకటేమిటి.. అవినీతికి కాదేది అనర్హం అన్నట్లుగా అడ్డగోలుగా దోచేశారు.
Also Read : వివేకా కేసుపై అవినాష్ కామెంట్స్.. టీడీపీ ఎమ్మెల్యే సెన్సేషనల్ పోస్ట్
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నుంచి ఆయాచిత లబ్ది పొందిన వారి నుంచి క్విడ్ ప్రో కో అంటూ తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించిన ఘనుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సూట్ కేస్ కంపెనీల ద్వారా వేల కోట్లను అడ్డగోలుగా దోచుకున్నారు. ఇందిరా టెలివిజన్, సాక్షి పత్రిక, భారతీ సిమెంట్, సండూర్ పవర్.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో.. మరెన్నో కంపెనీలు.. స్థాపించినవి, లాక్కున్నవి కూడా. వైఎస్ కుటుంబ దోపిడీ ఏ స్థాయిలో ఉందనేందుకు ఒకటే ఉదాహరణ.. ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల జాబితా. అలాగే ఆదాయపన్ను శాఖకు ముందస్తు ట్యాక్స్ చెల్లింపులు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 కోట్ల రూపాయలను ముందుగానే పన్ను అడ్వాన్స్ చెల్లించారంటే.. అసలు ఏ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టారో అర్థం చేసుకోవచ్చు. పది రూపాయల విలువైన షేర్‌ను ఏకంగా వందల్లో, వేలల్లో అమ్మేశారంటే.. బెదిరింపులు, లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు.
జగన్ అక్రమాస్తులపై ఫిర్యాదులు అందుకున్న సీబీఐ, ఈడీ అధికారులు.. ముందుగా సాక్షి సంస్థల్లోనే సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారులు కూడా ముందుగా సాక్షి సంస్థల ఆస్తులనే అటాచ్ చేశారు. అంటే.. సాక్షి పుట్టుకే అవినీతి. సాక్షి పుట్టుకే అక్రమం. ఇక సాక్షి పత్రికలో పనిచేసే సిబ్బందిలో మెజారిటీ వర్గం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. వారికే అందులో అగ్రతాంబూలం కూడా. సాక్షి మీడియాలో మొదటగా చక్రం తిప్పిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఇక సాక్షి పత్రికలో మెయిన్ రోల్ పోషించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. గతంలో సాక్షి ఫీచర్స్ పేజీ చూసిన వ్యక్తి రాంరెడ్డి. ప్రస్తుతం సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి.. ఇలా ఒకరేమిటి.. సాక్షి సంస్థలో కీలక స్థానాల్లో ఉన్న వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. చివరికి ఎడిషన్ ఇంఛార్జులు, స్టాఫ్ రిపోర్టర్లు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ వృత్తిలో నైపుణ్యం కంటే కూడా.. పేరు చివర ఉండే తోక చాలా ముఖ్యం. వచ్చిన వాడు మనవాడు అయితే చాలు.. నేరుగా పోస్టింగ్.
Also Read : బ్లూ మీడియాగా న్యూట్రల్ మీడియా.. గతం మరిచిందా..?
ఇలాంటి సాక్షి పత్రికలో ఇద్దరు ఉన్నతస్థాయి ఉద్యోగులు బజారున పడి మరీ తన్నుకున్న ఘటన ఇప్పుడు మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. ప్రస్తుతం ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ వైసీపీ నేతలను కలవరపెడుతోంది. బిగ్ బాస్ అరెస్టు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. అయితే యధా రాజా.. తథా ప్రజా అన్నట్లుగా.. తమ అధినేత లిక్కర్ స్కామ్ చేస్తే.. నేను మాత్రం తక్కువ తిన్నానా అని సాక్షిలో కింది స్థాయి ఉద్యోగులు భావించినట్లున్నారు. అందుకే మద్యం అక్రమ రవాణా చేస్తూ గతంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో సదరు విలేకరిని తొలగించారు. అయితే ఇప్పుడు అతని కోసం ఆ విలేకరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడమే ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవకు కారణమైంది.
వైసీపీ ప్రభుత్వంలో మద్యం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందుకే గోవా నుంచి అక్రమంగా లిక్కర్ తీసుకువచ్చిన కేసుతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సాక్షి బాపట్ల విలేకరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ఆరోపణలు నిజమని నిర్థారించుకున్న యాజమాన్యం.. అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. అంతవరకు బాగానే ఉంది. అయితే.. సదరు విలేకరి తన అక్రమ లావాదేవీలకు మీడియా అనే ముసుగు అవసరమని భావించి.. మళ్లీ తనదైన శైలిలో పావులు కదిపారు. తన అక్రమాలకు అండగా ఉన్న సాక్షి పత్రికలోని కీలక ఉద్యోగిని మచ్చిక చేసుకున్నాడు. బాపట్ల ఎడిషన్ మఫిషియల్ ఇంఛార్జ్‌ను మెప్పించిన సదరు విలేకరి తిరిగి ఉద్యోగంలో చేరారు. ఇదే ఇప్పుడు దుమారం రేపుతోంది.
Also Read : మా టార్గెట్ రిలయన్స్.. పాక్ స్ట్రాంగ్ వార్నింగ్
అసలు వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరగలేదని రోజూ వార్తలు రాస్తూ.. ఇప్పుడు మళ్లీ అదే దందా చేస్తూ పట్టుబడిన విలేకరిని ఎలా చేర్చుకుంటారని బాపట్ల బ్యూరో ఇంఛార్జ్ రమణారెడ్డి ప్రశ్న. క్లస్టర్ ఇంఛార్జ్ వెంకటరెడ్డి సంతకం లేకుండానే ఆరోపణలున్న విలేకరిని తిరిగి ఎలా తీసుకున్నారనేది ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణం. అసలు తన సంతకం లేకుండా.. తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా తొలగించిన వ్యక్తిని ఎలా తిరిగి ఉద్యోగంలో తీసుకున్నారనేది వెంకటరెడ్డి ప్రశ్న. దీనిపై వెంకటరెడ్డికి, మఫిషియల్ ఇంఛార్జ్‌కు మధ్య మాటా మాటా పెరిగి.. చివరికి కొట్టుకునే స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం స్టేట్ బ్యూరో వరకు చేరడంతో.. ఇద్దరినీ మందలించి, సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి కూడా సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఆరోపణలున్న వ్యక్తిని ఎందుకు తీసుకున్నారనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్. ఆరోపణలతో తొలగించిన తర్వాత ఎందుకు తిరిగి తీసుకునేందుకు పెద్ద మొత్తం చేతులు మారాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో.. యజమానిపైనే కాదు.. సిబ్బంది పైన కూడా అవినీతి ఆరోపణలు రావడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. సొంత సంస్థలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని వైఎస్ జగన్.. సొంత పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఎప్పుడు తెలుసుకుంటారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.