Saturday, October 18, 2025 10:58 PM
Saturday, October 18, 2025 10:58 PM
roots

ఎన్నాళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్..? బయటకు రాని టీటీడీపీ నాయకులు

రాజకీయ పార్టీల్లో కార్యకర్తలు ఎంత బలంగా ఉన్నా, నమ్మకంగా పార్టీని అంటిపెట్టుకొని నడుస్తున్నా నాయకత్వ పని తీరే ఆ పార్టీని ముందుకు నడిపిస్తుంది. కార్యకర్తల కష్టం, వారి బలమైన ఆలోచనలు ఎంతవరకు ప్రభావం చూపించిన సరే.. నాయకత్వం సమర్థవంతంగా లేకపోతే పార్టీ బలోపేతం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే.. కార్యకర్తల్లో, అభిమానుల్లో పార్టీ బాగుండాలి అనే తపన మినహా నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపించాలి అనే ఆలోచన కనపడటం లేదు.

Also Read : అలుపెరగని చంద్రబాబు.. టార్గెట్ యూరప్, గల్ఫ్..!

2004లో చివరిసారి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారం చూసింది. ఆ తర్వాత నుంచి పార్టీ క్రమంగా ఇబ్బందులు పడుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ , వరంగల్, మెదక్ జిల్లాలో పార్టీ నాయకత్వం ఎంతో బలంగా ఉండేది. అయితే 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే కార్యకర్తలు మాత్రం దాదాపుగా పార్టీ మారేందుకు ఆసక్తి చూపించలేదు.

చంద్రబాబు ఎప్పుడు బహిరంగ సభ నిర్వహించినా.. హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లినా.. వేలాదిమంది కార్యకర్తలు సొంత ఖర్చులతో వస్తూ ఉంటారు. నాయకులు ఎంతమంది పార్టీ మారినా సరే.. జండా మాత్రమే ఎగరేస్తూనే ఉంటారు. కానీ నాయకులు మాత్రం పార్టీ కార్యకర్తలను కనీసం పట్టించుకోవడం లేదు అనే విమర్శలు వినపడుతున్నాయి. చంద్రబాబు పార్టీ సమావేశం ఎప్పుడు నిర్వహించినా.. ఆ నలుగురు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతున్నారు అనే విమర్శ సైతం కార్యకర్తల్లో బలంగా ఉంది. ఆ పార్టీ కార్యకర్తలు ఎప్పటినుంచో చంద్రబాబుతో మమేకం కావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు వారికి అది సాధ్యపడలేదు.

Also Read : ఎన్టీఆర్ కు ఏమైంది..? ఫ్యాన్స్ లో కంగారు..!

రాష్ట్ర నాయకత్వం గానీ, అధిష్టానం గానీ తమకు అందుబాటులో లేకపోవడంతో ఎన్నో సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. తెలంగాణ నాయకులు వర్క్ ఫ్రం హోం విధానాన్ని ఫాలో కావడం కూడా చిరాకుగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విషయంలో నాయకత్వం సమర్థవంతంగా ముందుకు వెళ్లడం లేదు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా పోరాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఏమాత్రం బలం లేని బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. బూత్ లెవెల్ లో బలంగా ఉన్న టిడిపి మాత్రం పోటీ కూడా చేయకపోవడం చాలామంది కార్యకర్తలను నిరాశకు గురిచేస్తుంది.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని కార్యకర్తలు ఎదురు చూసినా సరే.. చంద్రబాబు మాత్రం ఆసక్తి చూపించలేదు. ఇక నాయకులు ఎక్కువగా ఇంటికి పరిమితం కావడం.. ఫోన్లు చేసి మాట్లాడటం, ఏదైనా నిరసన కార్యక్రమాలు ఉన్నా సరే ఫోన్ చేసి చెప్పడం.. వాళ్లు దూరంగా ఉండటం.. తమ పనులను అధికారంలో ఉన్న నాయకులతో చేయించుకోవడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా కనీసం పార్టీ కార్యాలయానికి రాలేని పరిస్థితి తెలంగాణా తెలుగుదేశం నాయకులది. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నా నడిపించే నాయకుడు కరువయ్యాడు. దాదాపుగా నాయకులు అందరూ ఇళ్ళకే పరిమితం అయ్యారు.

Also Read : మాతో మీకు పోలికేంటి..? బెంగళూరుకు పెమ్మసాని కౌంటర్

చంద్రబాబు వచ్చినప్పుడు కనపడే నాయకులు ఆ తర్వాత పార్టీ ఆఫీస్ కి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలకు సమస్య ఉన్నా సరే వాళ్లు ఫోన్ చేసి మాకు ఈ సమస్య ఉందని చెప్పిన సరే దానిని పరిష్కరించేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. ఇక సోషల్ మీడియా విషయంలో కార్యకర్తలు స్వచ్ఛందంగా చేయడమే గాని నాయకులు మాత్రం ముందుకు రాలేని పరిస్థితి. దీనితో.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నాయకులే చంపేశారు అనే అభిప్రాయం కార్యకర్తల్లో బలపడుతోంది. కనీసం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అధికార పార్టీపై విమర్శలు కూడా చేయలేని పరిస్థితిలో టిడిపి తెలంగాణ నాయకత్వం ఉండటం విడ్డూరం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

అలుపెరగని చంద్రబాబు.. టార్గెట్...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ...

పోల్స్