2014 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వైసిపి, వైసిపి అనుకూల మీడియా, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్న సంగతికి తెలిసిందే. తిరుమలలో లేనివి ఉన్నట్లుగా చూపించడమే కాకుండా.. ఉన్నవి లేనట్లుగా చూపించడంలో కూడా వైసిపి సోషల్ మీడియా సక్సెస్ అయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పింక్ డైమండ్ వ్యవహారాన్ని వాడుకుని మీడియా వేదికగా ప్రచారం చేస్తూ వచ్చింది. దీనిపై, ఎన్ని విధాలుగా టీటీడీ క్లారిటీ ఇచ్చిన సరే ప్రజల్లో ఇంకా అనుమానాలు.. అలాగే ఉన్నాయి.
Also Read : రేవంత్ రెడ్డి.. రియల్ రియల్టర్..!
ఒక టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పింక్ డైమండ్ అనేది లేదని తేల్చారు. దీనిపై టీటీడీలో పనిచేసిన అర్చకులు కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ఇటీవల టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఓ విగ్రహం విషయంలో ఆయన చేసిన హడావుడి టీటీడీకి తలనొప్పిగా మారింది. ఈ నేపద్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టిటిడి ఫ్యాక్ట్ చెక్ ఎకౌంటును ప్రారంభించింది. తిరుమల పై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు అరికట్టేందుకు టెక్నాలజీ ద్వారా టీటీడీ విజిలెన్స్ పట్టిష్ట చర్యలకు దిగింది.
Also Read : అమ్మవారి ఆలయ అధికారులపై విమర్శలు..!
ముఖ్యంగా వైసిపి తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమలను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ను లక్ష్యంగా చేసుకొని కూడా వైసిపి ప్రచారాలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఫ్యాక్ట్ చెక్ టీటీడీ తో భక్తులు వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉందని టీటీడీ ప్రకటించింది. అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలకు టిటిడి బోర్డు అడుగులు వేస్తోంది. టిటిడి విషయంలో సోషల్ మీడియా పై అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పై విజిలెన్స్ పోలీసులు నిరంతర నిఘా పెట్టాలని నిర్ణయించారు.