Wednesday, February 4, 2026 05:49 PM
Wednesday, February 4, 2026 05:49 PM

భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్..!

వైకుంఠ ద్వారా దర్శనాల విషయంలో గత నెల రోజుల నుంచి టీటీడీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. భక్తుల సంఖ్య భారీగా ఉన్న నేపధ్యంలో ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి దుష్ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. టోకెన్ లు లేని భక్తులను అనుమతించరు అని, టికెట్ లు లేని భక్తులకు అనుమతి లేదు అనే ప్రచారం నేపధ్యంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి తాజాగా చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేసాడు.

Also Read : వాట్సాప్ కు ప్రత్యామ్నాయ బెస్ట్ యాప్స్ ఇవే..?

డిసెంబర్‌ 30 నుంచి జనవరి 8 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం 2 నెలలుగా అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రుల సబ్‌ కమిటీ కూడా టీటీడీతో నిరంతరం సమీక్షిస్తోందన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టికెట్లు, టోకెన్లు లేని వారికి తిరుమలకు అనుమతి లేదంటూ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు విజ్ఞప్తి చేసారు. తిరుమలకు భక్తుల అనుమతిని నిరాకరించే హక్కు ఎవరికీ లేదు అని స్పష్టం చేసారు.

Also Read : ఐటీ విప్లవం తర్వాత క్వాంటం విప్లవానికి ఏపీ నాంది

మొదటి 3 రోజులు టోకెన్లు కలిగిన భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు. జనవరి 2 నుంచి 7 వరకు టోకెన్లు లేకపోయినా దర్శనానికి అనుమతి ఇస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఏర్పాట్లు చేసిందన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో మరింత అవగాహన కల్పించేందుకు మీడియాలో విస్తృత ప్రచారం చేయాలని కోరుతున్నాను అన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

పోల్స్