Sunday, March 22, 2026 06:41 AM
Sunday, March 22, 2026 06:41 AM

హెచ్ 1 బీ విషయంలో ట్రంప్ కు షాక్..?

హెచ్ 1 బీ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. లక్ష డాలర్ల ఫీజు పెంచుతూ నిర్ణయం అమలు చేయడంపై అమెరికా సంయుక్త రాష్ట్రాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఈ అంశంపై కోర్ట్ కు వెళ్ళాయి. ఆస్పత్రులు, యూనివర్సిటీలు, ప్రభుత్వ పాఠశాలలు విస్తృతంగా ఉపయోగించే ఈ వీసా కార్యక్రమంలో ఎక్కువగా విదేశీ కార్మికులను నియమించుకోవడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.

Also Read : జట్టులోనే పనికిరాని వాడ్ని కెప్టెన్ చేస్తారా..?

హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అమలు చేస్తున్న ఈ విధానంపై ఇప్పుడు పలు రాష్ట్రాలు కోర్ట్ కు వెళ్లేందుకు రెడీ అయ్యాయి. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఈ నిర్ణయాన్ని అమలు చేసే అధికారం లేదని మండిపడ్డారు. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికాకు విదేశీ కార్మికుల అవసరం ఉందని, ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన ప్రతిభ మన శ్రామిక శక్తిలో చేరినప్పుడు, అది మన దేశాన్ని ముందుకు నడుపుతోందని, కాలిఫోర్నియాకు ఈ విషయం తెలుసనీ అన్నారు.

Also Read : భారత క్రికెట్ కు పట్టిన దరిద్రం గౌతమ్ గంభీర్

అధ్యక్షుడు చట్ట విరుద్దమైన నిర్ణయాలు తీసుకున్నారని, ఇతర కీలకమైన సేవలను అందించేవారిపై అనవసరమైన, చట్టవిరుద్ధమైన ఆర్థిక భారాలను సృష్టిస్తుందని విమర్శించారు. కీలక రంగాలలో కార్మిక కొరతను పెంచుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ 19, 2025న జారీ చేసిన ప్రకటన ద్వారా భారీ ఫీజును పెంచడంపై ఆవేదన వ్యక్తమైంది. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్న నేపధ్యంలో.. చాలా మంది అమెరికా వెళ్ళే ఆలోచన విరమించుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్