Sunday, March 22, 2026 04:58 AM
Sunday, March 22, 2026 04:58 AM

పవన్ ను వేధిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు..!

ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలో ఉంది.. పదేళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత జనసేన పార్టీ అధికార రుచి చూసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యారు. జనసేన శ్రేణుల్లో మాటలకు అందని సంతోషం. 21 సీట్లతో సరిపెట్టుకుని చేసిన త్యాగానికి ఫలితం జన సైనికులు ఎంజాయ్ చేసారు. పవన్ ను తక్కువ అంచనా వేసిన వాళ్ళు.. అన్ని రకాలుగా సైలెంట్ అయ్యే విధంగా రిజల్ట్ వచ్చింది. అక్కడి వరకు అందరూ హ్యాపీ.. కానీ ఓ కొత్త సమస్య మాత్రం జనసేనను నిరంతరం వెంటాడుతూనే ఉంది.

Also Read : కూటమిలో పెద్దల సభ పంచాయితీ..!

జనసేన ఎమ్మెల్యేలు ఎవరో, జనసేన ఎంపీలు ఎవరో.. పార్టీ క్యాడర్ కు ఇప్పటికీ అర్ధం కాని పరిస్థితి. అంటే దాని అర్ధం.. మీడియాలో కనపడటం లేదనేది. పార్టీ అధికారంలో లేనప్పుడు.. ఏది మాట్లాడినా పవన్ మాట్లాడేవారు. కర్త, కర్మ, క్రియ పవన్ అయ్యారు. ఇప్పుడు కూడా పవన్ కేంద్రంగానే జనసేన ప్రయాణం నడుస్తోంది. పార్టీని సుదీర్ఘ కాలం పాటు.. ఏపీ గడ్డపై నిలబెట్టాలని పవన్ ప్రయత్నం చేస్తుంటే.. కనీసం వైసీపీపై విమర్శలు చేయడం లేదు ఎమ్మెల్యేలు. కనీసం మీడియా ముందుకు రావడం లేదనే ఆవేదన వ్యక్తమవుతోంది. కనీసం పవన్ కళ్యాణ్ ను ప్రత్యర్ధి పార్టీలు విమర్శిస్తున్న సమయంలో కూడా కనీస స్పందన లేకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది.

Also Read : ఏబీవి రాజకీయ అడుగు: ఒత్తిడి వ్యూహమా లేక స్వతంత్ర ప్రయాణమా?

మంత్రులు.. నాదెండ్ల, కందుల మినహా ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గానీ రాష్ట్ర స్థాయిలో కనపడటం లేదు. పవన్ పై విమర్శలు చేసినా ప్రభుత్వంపై విమర్శలు చేసినా సరే.. స్పందన లేదు. టీడీపీ ఎమ్మెల్యేల వైఖరినే జనసేన ఎమ్మెల్యేలు ప్రదర్శిస్తున్నారు. ఎంపీల వైఖరి కూడా అలాగే ఉంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు.. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు స్పందించాలి. తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. భోగాపురం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, అమరావతిపై విమర్శలు.. ఏది వచ్చినా సరే మౌనంగానే ఉంటున్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు. ఇదే ఇప్పుడు పవన్ ను వేధిస్తున్న అంశం. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వ సానుకూల ప్రచారం ఏదీ లేకుండా భారం మొత్తం అధినేతపై వదిలేసి చోద్యం చూడటం ఏంటో అర్ధం కాని పరిస్థితి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్