ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్ లో టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆల్ అవుట్ అయినా… ఆస్ట్రేలియా వెన్ను విరిచి, విజయానికి బాటలు వేసాడు. తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి బూమ్రా 8 వికెట్లు తీసాడు. అందులో 5 వికెట్ల ప్రదర్శన ఒకటి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోయిన్నా బూమ్రా జట్టును విజయవంతంగా నడిపించాడు. కీలక సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి… మూడో రోజు చివర్లో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు.
Also Read : గిల్ సిద్ధం.. రాహుల్ ప్లేస్ ఫైనల్ అయినట్టే..?
ఇక బూమ్రా బౌలింగ్ కు అతని సారధ్యానికి ఆస్ట్రేలియా కీలక ఆటగాడు ట్రావిస్ హెడ్ ఫిదా అయిపోయాడు. అతనితో తలపడటం చాలా గర్వంగా ఉందన్నాడు హెడ్. బూమ్రా తన ప్రదర్శనతో గొప్ప బౌలర్ గా కెరీర్ ను ముగిస్తాడని, భవిష్యత్తులో అతను మరింత ప్రమాదకారిగా మారతాడు అంటూ హెడ్ చెప్పుకొచ్చాడు. బూమ్రాతో తాను ఆడిన ఆటను తన భవిష్యత్తు తరాలకు చెప్పుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని… తన మనవళ్ళకు బూమ్రా బౌలింగ్ గొప్పతనం గురించి, వీడియోలు చూపించి మరీ చెప్తాను అంటూ కామెంట్ చేసాడు.
Also Read : ‘ఇండియా’ ఐక్యతకు తూట్లు..!
కెరీర్ ను వెనక్కు తిరిగి చూసుకుంటే బూమ్రా బౌలింగ్ ఆడింది తాను ఎప్పటికి మర్చిపోను అని చెప్పుకొచ్చాడు. ఇక కెప్టెన్ గా రోహిత్ శర్మ రావడంతో బూమ్రా రెండో టెస్ట్ లో అత్యంత కీలకంగా మారతాడు అని… అతను పూర్తిగా బౌలింగ్ పై దృష్టి పెట్టి ఆస్ట్రేలియాకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెడ్ అభిప్రాయపడ్డాడు. కాగా రెండో టెస్ట్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లో హెడ్ ఒంటరి పోరాటం చేసినా ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు.

