Sunday, March 22, 2026 01:15 PM
Sunday, March 22, 2026 01:15 PM

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ లో యుద్ద మేఘాలు

2026 సంక్రాంతికి టాలీవుడ్లో యుద్ద వాతావరణమేనా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. సాధారణంగా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవ్వడం సహజం అయితే.. వచ్చేయేడాది సంక్రాంతికి మాత్రం టాలీవుడ్ లో కచ్చితంగా యుద్ద వాతావరణం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో భారీగా రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. దాదాపు అందరు స్టార్ హీరోలు ఆ రెండు మూడు నెలల్లోనే సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

Also Read : బాలీవుడ్ గోల్డెన్ లెగ్ రష్మిక

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా వచ్చేయడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. డిసెంబర్ నుంచి సంక్రాంతి మధ్యలో ఆ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే సినిమాను కూడా అప్పుడే రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 9న సినిమాను రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఇక గోపీచంద్ మలినేని, నందమూరి బాలకృష్ణ కాంబోలో వస్తున్న సినిమాను కూడా వచ్చేయేడాది సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Also Read : ఏపీ బడ్జెట్.. ప్రాధాన్యతలు ఇవే..!

ఇక బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న పెద్ది సినిమాను కూడా సంక్రాంతి సమయంలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మహేష్ బాబు.. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కూడా సంక్రాంతికి లేదా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలంటే లేట్ అవుతూ ఉంటాయి.

Also Read : కేసుల భయమా..? నియోజకవర్గంలో చిచ్చా..?

కానీ ఈ సినిమా మాత్రం అలా కాకుండా చాలా ఫాస్ట్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అందుకే రాజమౌళి సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. అటు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. లేటెస్ట్ గా దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా బయటకు వచ్చింది. ఇలా చూసుకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి కచ్చితంగా ప్రేక్షకులకు భారీ కానుకలు ఇచ్చే సంకేతాలే కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్