Thursday, April 9, 2026 11:08 PM
Thursday, April 9, 2026 11:08 PM

టాలీవుడ్‌లో పర్సంటేజ్ వార్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో పర్సంటేజ్ విధానంపై రేగిన వివాదం ఇప్పుడు ముదిరి పాకాన పడింది. తెలంగాణలోని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో, రేపు విడుదల కాబోయే సినిమాలపై గందరగోళం నెలకొంది. సాధారణంగా సినిమా వసూళ్లలో థియేటర్ యాజమాన్యాలకు, నిర్మాతలకు మధ్య కొంత వాటా ఉంటుంది. అయితే, మల్టీప్లెక్స్‌ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ పర్సంటేజ్ పద్ధతిని మార్చాలని, నిర్మాతలకు లభించే వాటాను పెంచాలని గిల్డ్ డిమాండ్ చేస్తోంది.

Also Read : “రాకా” వందల కోట్ల బడ్జెట్.. వెయ్యి కోట్ల టార్గెట్..!

దీనికి ఎగ్జిబిటర్లు సమ్మతించకపోవడంతో గత కొన్ని రోజులుగా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీని ప్రభావం.. విడుదల కాబోయే సినిమాలపై పడే అవకాశం కనపడుతోంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ డెకాయిట్ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ పర్సంటేజ్ వివాదం కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రధాన థియేటర్లలో అగ్రిమెంట్లు ఇంకా పూర్తి కాలేదని సమాచారం.

Also Read : టార్గెట్ ఒలింపిక్స్.. మరి వసతుల మాటేమిటీ..?

ఒకవేళ ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోతే, కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శన నిలిచిపోయే ప్రమాదం ఉందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సినిమా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిందని, పాత పర్సంటేజ్ పద్ధతి వల్ల నిర్మాతలు నష్టపోతున్నారని గిల్డ్ సభ్యులు వాదిస్తున్నారు. కరెంటు ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిన తరుణంలో తమ వాటాను తగ్గిస్తే థియేటర్లు నడపడం కష్టమని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు శుక్రవారం కావడంతో డెకాయిట్ తో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వివాదం సర్దుమణిగి థియేటర్లలో బొమ్మ పడుతుందా..? లేక ప్రదర్శనలు రద్దవుతాయా..? అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఎమ్మెల్యేలకు లోకేష్ వార్నింగ్..!

తెలుగుదేశం పార్టీలో సింగిల్ టైం ఎమ్మెల్యేలకు...

వైఎస్ఆర్ మరణానికి జగనే...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం...

ఢిల్లీ వెలుపల మరో...

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి మరో...

బ్రేకింగ్: మహానాడు పై...

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే...

మావిగన్ పై తిట్లేనా..?...

ఏపీ రాజకీయాల్లో గత పది రోజుల...

త్రిషాతో రిలేషన్.. విజయ్...

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్,...

పోల్స్