Sunday, March 22, 2026 02:35 AM
Sunday, March 22, 2026 02:35 AM

తెలుగు సినీ పరిశ్రమకు అవార్డు శాపమా…!

నేషనల్ అవార్డు… ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. 80 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది కేవలం అల్లు అర్జున్‌కు మాత్రమే. అది కూడా పుష్ప 1 సినిమాకు. అందులో బన్నీ నటనకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఇది అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌ కూడా. ఎంతో మంది మేటి నటులున్నప్పటికీ.. వారందరికీ దక్కని గౌరవం అల్లు అర్జున్‌కు దక్కిందని అంతా సంబరాలు జరుపుకున్నారు కూడా. అదే సమయంలో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. వరుసగా బాహుబలి, ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి సినిమాల వల్ల ఓ రేంజ్‌కు చేరుకుంది. ఇక పుష్ప అయితే ఓ రేంజ్. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడం… అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కడం.. టాలీవుడ్ రేంజ్ పెరిగింది.

Also Read : విడుదలైన పుష్ప… ఇంటి వద్ద ఎమోషన్ సీన్స్

అయితే ఇటీవల జరిగిన రెండు పరిణామాలు టాలీవుడ్‌ను కలవరపెడుతున్నాయి. ఒకటి అల్లు అర్జున్ అరెస్ట్ అయితే… మరోటి జానీ మాస్టార్ అరెస్ట్. అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాగా.. జానీ మాస్టర్‌కు కూడా 2022 ఏడాదికి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు దక్కింది. తమిళ సినిమా “తిరుచిత్రాబళం”లోని మేఘం కరుగత పాటకు జానీ మాస్టర్‌కు అవార్డు వచ్చింది. ఈ అవార్డును ఈ ఏడాది అక్టోబర్ 8న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో తీసుకోవాల్సి ఉంది. అయితే సరిగ్గా 3 రోజుల ముందు అవార్డు నిలిపివేస్తున్నట్లు అవార్డు కమిటీ ప్రకటించింది. పోక్సో చట్టం కింద జానీ మాస్టర్‌పై కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తన అసిస్టెంట్‌ను లైగింకంగా వేధించారంటూ జానీ మాస్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జానీ మాస్టర్ భార్య కూడా ఆరోపించారు.

Also Read : తెలుగు రాష్ట్రాలకు షేక్ చేస్తున్న భాయ్ అరెస్ట్… చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు సినీ ప్రముఖులు

ఇక ఇప్పుడు అల్లు అర్జున్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. 2021లో విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఈ అవార్డును 2023 అక్టోబర్ 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అందుకున్నాడు. నాటి నుంచి బన్నీ క్రేజ్ డబుల్ ట్రిబుల్ అయ్యిందనే చెప్పాలి. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో టాలీవుడ్‌లో సంబరాలు జరుపుకున్నారు కూడా. ఈ అవార్డు రావడం కూడా పుష్ప 2 సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆ తొక్కిసలాటకు అల్లు అర్జున్ కారణమంటూ ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి… బన్నీని అరెస్టు చేశారు. దీంతో జాతీయ అవార్డు తెలుగు సినిమాకు అంతగా అచ్చి రాలేదేమో అనే మాట వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్