Sunday, March 22, 2026 11:32 AM
Sunday, March 22, 2026 11:32 AM

జాతీయ జట్టులో దుమ్మురేపుతున్న గుంటూరు కుర్రోడు

ఇండియన్ క్రికెట్ టీంలో యువ ఆటగాళ్ళ డామినేషన్ మొదలయింది. సీనియర్ ఆటగాళ్ళు క్రమంగా జట్టుకు దూరం కావడంతో జట్టులో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో యువ కెరటం తిలక్ వర్మ ముందు వరుసలో ఉన్నాడు. ఈ గుంటూరు కుర్రోడి ఆట రోజు రోజుకు మెరుగు కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. మిడిల్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్ అవసరం టీంకు ఉంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం సెలెక్టర్ లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టెస్ట్ తో పాటుగా వైట్ బాల్ క్రికెట్ లో యువరాజ్ తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఆ స్థాయి ఆటగాడు కనపడటం లేదు.

Also Read : ముగిసిన 9 ఏళ్ల విస్తారా ప్రస్థానం..!

ఈ టైం లో తిలక్ వర్మ సైలెంట్ గా షైన్ కావడం ఇప్పుడు భారత జట్టుకు బలంగా మారనుంది. సౌత్ ఆఫ్రికా పిచ్ లపై ఆడటం అంత ఈజీ కాదు. కాని… తిలక్ వర్మ మాత్రం దుమ్ము రేపాడు. ఈ 22 ఏళ్ళ ఆటగాడు… మూడు మ్యాచుల్లో 80 యావరేజ్ తో 160 పరుగులు చేసాడు. స్ట్రైక్ రొటేట్ చేయడం, అవసరమైనప్పుడు భారీ షాట్ లు ఆడి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించడం… సాలిడ్ డిఫెన్స్ కూడా ఉండటం తిలక్ వర్మకు ప్లస్ అయింది. మూడో మ్యాచ్ లో తిలక్ వర్మ సెంచరీ చూస్తే… విధ్వంశం ఏ రేంజ్ లో జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read : అడ్డంగా బుక్ అయిన కేటిఆర్

బౌలర్లపై ఒత్తిడి పెంచుతూ పరుగులు రాబడుతూ మిడిల్ ఆర్డర్ లో కీలకంగా ఎదుగుతున్నాడు తిలక్ వర్మ. ఐపిఎల్ లో ముంబై తరుపున ఆడుతున్న ఈ ఆటగాడిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిడిల్ ఆర్డర్ లో కీలకం అయ్యాడు. ఇదే నిలకడ కొనసాగిస్తే మాత్రం భారత జట్టుకు మరో యువరాజ్ దొరికినట్టే. మిడిల్ ఆర్డర్ లో ప్రస్తుతం పంత్ కీలకంగా ఉన్నాడు. పంత్ కు తిలక్ వర్మ తోడు అయితే మాత్రం ఓవర్సీస్ లో కచ్చితంగా ప్లస్ అవుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్