Sunday, March 22, 2026 10:48 AM
Sunday, March 22, 2026 10:48 AM

వాళ్లకు మళ్ళీ నిరాశే.. ఇదేం సెలెక్షన్ అగార్కర్..?

న్యూజిలాండ్ తో వన్డే సీరీస్ నేపధ్యంలో ఎంతో ఉత్కంట రేపుతోన్న భారత జట్టు ఎంపికకు సెలెక్టర్ లు తెరదించారు. కాసేపటి క్రితం వన్డే జట్టును ఎంపిక చేసింది సెలెక్షన్ కమిటీ. శుభమన్ గిల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసారు సెలెక్టర్ లు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో తమ స్థానం నిలుపుకోగా.. ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసారు. అయితే అతనికి ఫిట్నెస్ నిరూపించుకోవాలని సెలెక్టర్ లు తెలిపారు.

Also Read : ప్రపంచ క్రికెట్‌ ను శాసించే స్థాయిలో కొత్త స్టేడియాలు..!

ఇక వికెట్ కీపర్లుగా కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ లను ఎంపిక చేసారు. ఆల్ రౌండర్ లు గా వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డిలను ఎంపిక చేసిన సెలెక్టర్ లు.. హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇచ్చారు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ తిరిగి జట్టులో చేరగా.. సౌత్ ఆఫ్రికాతో చివరి వన్డేలో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ను ఎంపిక చేసారు సెలెక్టర్లు. అయితే సీనియర్ బౌలర్ బూమ్రాకు విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్ లు, మరో సీనియర్ బౌలర్ మహ్మద్ శమీని మాత్రం పట్టించుకోలేదు.

Also Read : ఈ ఎమ్మెల్యే గారు మారరా..? చికాకులో క్యాడర్..!

అయితే హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ కోసమే షమీని తప్పించారు అనే ఆరోపణలు వచ్చాయి. గత ఏడాది కాలంగా దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్న ఈ సీనియర్ బౌలర్ ను పక్కనపెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అలాగే యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికాపై రాణించినా పట్టించుకోకపోవడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. గిల్ దేశవాళి క్రికెట్ కూడా ఆడకపోయినా అతనిని కెప్టెన్ గా ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో రాణిస్తున్న, పడిక్కల్ ను కూడా సెలెక్టర్ లు విస్మరించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్