Sunday, March 22, 2026 02:23 AM
Sunday, March 22, 2026 02:23 AM

రఘురామరాజు కేసులో కీలక ట్విస్ట్..! విజయ్ పాల్ ను దాచింది ఎవరు..?

ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజుపై కస్టడీలో వేధింపుల వ్యవహారాన్ని ఏపీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసు విషయంలో సాక్ష్యాలను నమోదు చేయిస్తున్నారు పోలీసులు. గుంటూరు మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట సాక్ష్యాలను నమోదు చేయిస్తున్నారు. భవిష్యత్తులో మాట మార్చకుండా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కస్టడీలో చిత్ర హింసలకు గురిచేసిన సమయంలో సీఐడీ ఆఫీసులో ఉన్న వారి నుంచి వాంగ్మూలం తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలో పలు కీలక అంశాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

రఘురామను సీఐడీ కస్టడీకి తీసుకువచ్చిన రోజు రాత్రి ఏం జరిగింది? అనే ప్రశ్నను బేస్ చేసుకునే విచారణ వేగవంతం చేసారు. ఆ రోజు విధుల్లో ఉన్న ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, మరో నలుగురు సిబ్బంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ పోలీసులకు ఓ సమస్య వచ్చింది. వారు అందరూ పోలీసు అధికారులు కావడంతో భవిష్యత్తులో కేసు విచారణ సందర్భంగా ఈ స్టేట్మెంట్స్ ని కోర్టు ఎంత వరకు పరిగణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అందుకే భవిష్యత్తులో వారు మాట మార్చే అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు.

Also Read : ఏపీలో కొత్త జిల్లాలు ఇవేనా…?

నేరుగా వారందరి స్టేట్మెంట్ ని మేజిస్ట్రేటు వద్దనే నమోదు చేయించడం గమనార్హం. మంగళవారం గుంటూరు జిల్లా మొబైల్ కోర్టులో ఈ ప్రక్రియ ప్రారంభించారు. విజయపాల్ ని విచారిస్తేనే సీఐడీ కస్టడీలో ఉన్న రఘురామను కొట్టిందెవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు విధుల్లో ఉన్న వారు ఎవరూ ఆయన్ను కొట్టలేదు అని అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ కె. విజయపాల్ నేతృత్వంలో కొందరు వ్యక్తులు బయట నుంచి వచ్చి రఘురామను టార్చర్ చేసారని చెప్పినట్టు సమాచారం. కాని వారు ఎవరూ అనేది స్పష్టత లేదు. అయితే విజయ్ పాల్ ఎక్కడ ఉన్నారనేది క్లారిటీ లేదు. ఆయన బయటకు వస్తే మాత్రం కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. విజయ్ పాల్ ను వైసీపీ పెద్దలే దాచి పెట్టారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి నిజా నిజాలు ఏమిటో పోలీసులే తేల్చాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్