Saturday, September 13, 2025 02:33 PM
Saturday, September 13, 2025 02:33 PM
roots

పోలవరంపై మాట నిలబెట్టుకుంటున్న మోడీ…!

బడ్జెట్ లో ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ కు భారీగా నిధులు కేటాయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నిధులపై అథారిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. పునరావసానికి 5500 కోట్లు కేటాయించారు. నిర్మాణానికి 1700 కోట్లు కావాలన్న అధికారుల.. ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలబెట్టాల్సీ ఉంది. తొలి దశలో 8 మండలాల పరిధిలో 172 నివాసాల్లో..38060 మంది పునరావసం కల్పించాలని అధికారులు ఓ నివేదిక సిద్దం చేసారు.

ఇప్పటివరకు 12,797 మందికి పునరావసం కల్పించారు. ఇంకా 25, 263 మందిని పునరావస కేంద్రాలలో తరలించాల్సి ఉంటుంది. వీరి కోసం 16, 440 ఎకరాల భూమి సేకరించాలని ప్రభుత్వం ఓ నివేదిక సిద్దం చేసింది. దీని గాను 2,435 కోట్ల రూపాయలు అవసరం కానుంది. ఇక మరొకవైపు వీరందరికీ నిర్వాసిత ప్యాకేజీ కోసం 2043.59కొట్లు అవసరం అని నివేదికలో ప్రస్తావించారు. పునరావస కాలనీల నిర్మాణానికి 3314 కోట్లు కావాల్సి ఉంటుంది. 2025 జూన్ నాటికి ఎంతవరకు చేయగలరు అంతవరకు చేయాలని చెప్పి ప్రతిపాదనలు సిద్దం చేసారు.

Read Also : కొత్త మద్యం పాలసీపై మాట్లాడే ధైర్యం లేదా జగన్?

తక్షణం 5500 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నవంబర్లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి మధ్య ఒప్పందం పూర్తయినట్టు తెలుస్తోంది. కొత్త డయాఫ్రం వాల్, మట్టి సాంద్రత పెంచడంతో పాటుగా ప్రధాన డ్యాం గ్యాప్-2లో పాత డయాఫ్రం వాల్కు సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేపడతారు. దాదాపు 64 వేల చదరపు మీటర్ల పని చేయాల్సి ఉంటుందని అధికారులు నివేదికల్లో ప్రస్తావించారు. 2025 జూన్ కి పూర్తిచేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. నవంబరు నాటికి డిజైన్లు, ఇతర అంశాలపై కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ప్రధాన డ్యాం మొదటి రెండు గ్యాప్లలో మట్టిసాంద్రత పెంచే పనులు చేయాల్సి ఉంది.

అక్కడ ఇసుకను నింపి వైబ్రో కాంపాక్షన్ ద్వారా అక్కడ మట్టి గట్టిదనం పెంచాల్సి ఉంటుంది. ఇందుకు షెడ్యూలు కూడా పోలవరం అథారిటీకి సమర్పించారని సమాచారం. అనుసంధాన పనుల్లో ఎడమ టన్నెల్ హెడ్ రెగ్యులేటర్, ఎడమ టన్నెల్ లైనింగ్, కుడి టన్నె ళ్లలో మట్టి తవ్వకం లైనింగ్ కూడా 2025 జూన్ నాటికి పూర్తి చేసేలా షెడ్యూలు సిద్దం చేసారు. ఇంకా, తొలిదశలో ఆయ కట్టుకు నీళ్లందించేలా కుడి, ఎడమ కాలువల్లో కూడా పనులు చేయాలని అధికారులు నివేదికల్లో స్పష్టం చేసారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

పోల్స్