ఓజీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే మేనియా నడుస్తోంది. యంగ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో వచ్చిన ఓజీ.. థియేటర్లలో దుమ్ము రేపుతోంది. నిజానికి ఓజీ సినిమాకు ఈ స్థాయి క్రేజ్ రావడానికి కేవలం ఇద్దరే కారణం.. పవన్‌ను సుజిత్ కొత్తగా చూపించాడు. ఇక థియేటర్లలో పవన్ ఫ్యాన్స్‌తో సినీ ప్రేక్షకులకు కూడా పిచ్చేక్కించి థమన్ మాత్రమే. ఓజీ బీజీఎం ఓ రేంజ్‌లో ఉంది. సినిమా మొదలు నుంచి చివరి రోలింగ్ టైటిల్ వరకు ప్రేక్షకులను ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు థమన్. ఇదేం కొట్టుడు బాబు అంటున్నారు పవన్ ఫ్యాన్స్.
Also Read : లోకేష్ సాయం.. పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు..!
ఓజీ ఇప్పటికే రికార్డు కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు ఓజీ ప్రభావం మరో రెండు నెలల్లో రానున్న అఖండ 2 పైన బాగా పడిందనే మాట టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ నెల 25వ తేదీనే అఖండ 2 విడుదల కావాల్సి ఉంది. అయితే ఓజీ కోసం వాయిదా వేశారనే మాట టాలీవుడ్‌లో వినిపిస్తోంది. కానీ దర్శక నిర్మాతలు మాత్రం.. కొద్దిపాటి షూటింగ్, సీజీ వర్క్ ఉండటం వల్ల వాయిదే వేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో అఖండ 2 తాండవం అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
ఓజీతో దుమ్ము రేపిన థమన్.. ఇప్పుడు అఖండ 2కు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే అఖండ 2 టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఇదెక్కడి మాస్ అంటున్నారు బాలయ్య అభిమానులు. అఖండతో మొదలైన థమన్ ప్రయాణం వరుసగా 5 సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ తర్వాత వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇప్పుడు అఖండ 2.. ఇలా థమన్, బాలయ్య కాంబో సూపర్ హిట్ అంటున్నారు అభిమానులు.
Also Read : ఆ ఇద్దరి మధ్య మళ్లీ వార్ మొదలైందా..?
డాకు మహారాజ్ దెబ్బకు థియేటర్లలో సౌండ్ బాక్సులు పేలిపోయాయి. అలాంటి బీజీఎంతో బాలయ్య అభిమానులను థమన్ ఊపేశారు. అలాంటి థమన్ ఓజీతో రెచ్చిపోయారు. దీంతో అఖండ 2పై ఇప్పుడు అంచనాలు రెట్టింపు అయ్యాయి. అఖండ బీజీఎం ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తు. అదే సీక్వెల్‌లో వస్తున్న అఖండ 2 ఇంకెలా ఉంటుందో అని బాలయ్య అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.