Sunday, March 22, 2026 01:24 PM
Sunday, March 22, 2026 01:24 PM

కాశ్మీర్ లో తెలుగోడి సత్తా.. ఉగ్రవాదులకు చుక్కలు చూపిస్తున్న ఆఫీసర్..!

ఒకవైపు భద్రత బలగాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్న సరే.. చాప కింద నీరుల విస్తరిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉగ్రవాదులపై భద్రత బలగాలు దృష్టి సారించాయి. పాకిస్తాన్ ప్రోద్బలంతో దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను భారత ఆర్మీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. కాశ్మీర్ లోయలోని సరిహద్దు గ్రామాల్లో ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తోంది. అనుమానం వచ్చిన వాళ్లను అరెస్టులు చేసి ప్రశ్నిస్తోంది.

Also Read : ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ ప్రవీణ్ ప్రకాష్.. షాక్ లో అధికార వర్గాలు

ఈ నేపథ్యంలో తాజాగా ఓ తెలుగు ఆర్మీ అధికారి చూపించిన చొరవ ప్రశంసలు అందుకుంటుంది. ఉగ్రవాదుల కుట్రలను తిప్పికొట్టడంలో ఆ అధికారి అందించిన క్లూ ఎంతో కీలకంగా మారింది. అసలు ఏంటి ఆ క్లూ అనేది ఒకసారి చూద్దాం. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఒక కుట్రను అధికారులు చేదించారు. ఈ కేసులో మొదటి లీడ్ ఇచ్చింది కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి అనే ఆర్మీ అధికారి. ప్రస్తుతం ఆయన శ్రీనగర్ ఎస్ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్ లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు.

Also Read : వైసీపీలో కలకలం.. అప్రూవర్‌గా ధర్మారెడ్డి..!

జైషే మహమ్మద్ పోస్టర్లను మొదట గుర్తించింది సందీప్ చక్రవర్తినే. పోస్టర్లు అంటించిన వారిని సిసి కెమెరాలు ద్వారా గుర్తించారు సందీప్. ముగ్గురు నిందితులపై గతంలో స్టోన్ పెల్టింగ్ కేసులు కూడా నమోదయ్యాయి. ముగ్గురు నిందితులు సోఫియాన్, ఇర్ఫాన్, అహ్మదులను అరెస్టు చేసి రెండు వారాలపాటు సందీప్ చక్రవర్తి విచారించారు. వాళ్ళు ఇచ్చిన పక్కా సమాచారం తోనే డాక్టర్ల టెర్రర్ మాడ్యూల్ ప్లాన్ బయటికి వచ్చింది. దీనితో ఆర్మీ వర్గాల్లో సందీప్ చక్రవర్తి పేరు మార్మోగిపోతోంది. అటు ఉగ్రవాదులకు కూడా సందీప్ కొరకరాని కొయ్యగా మారారు. ఆర్మీలోని ఉన్నతాధికారులకు కూడా సందీప్ నమ్మకమైన అధికారిక గుర్తింపు పొందారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్