Sunday, March 22, 2026 10:12 AM
Sunday, March 22, 2026 10:12 AM

టెలికం కీలక నిర్ణయం.. ఇక వారికి చెక్..!

టెలికం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సిమ్ కార్డు దారులకు వార్నింగ్ ఇచ్చిన టెలికం శాఖ.. తాజాగా సోషల్ మీడియా వినియోగదారులకు కూడా కీలక సూచనలు చేసింది. ఇప్పటి వరకు వాట్సప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు వినియోగిస్తున్న వారికి ఇకపై తప్పని సరిగా టెలికం శాఖ సూచించిన నిబంధనలు వర్తిస్తాయి. ఇకపై ఏ ఫోన్‌లో అయితే సిమ్ కార్డు ఉంటుందో.. అదే ఫోన్‌లో మాత్రమే వాట్సప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు పని చేస్తాయి. అలా కాకుండా.. ఒక ఫోన్‌లో సిమ్ కార్డు వాడుతూ.. మరో ఫోన్‌లో వాట్సప్ లాంటి సోషల్ మీడియా యాప్‌లు వినియోగిస్తామంటే.. ఇకపై కుదరదని టెలికం శాఖ తేల్చి చెప్పింది.

Also Read : మహిళల చేత మారణహోమం.. ఎర్రకోట బ్లాస్ట్ లో సంచలన విషయాలు

మెసేజింగ్ యాప్‌లను స్కామర్లు దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ప్రధానంగా వీడియో కాలింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటి సంఖ్య బాగా పెరిగింది. వీటితో పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులు కూడా భారీగానే వస్తున్నాయి. కొంతమంది భయంతో లక్షల రూపాయలు పొగొట్టుకుంటున్నారు. ఇలాగే హనీ ట్రాప్ పేరుతో కూడా నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇలాంటి వారికి అడ్డుకునేందుకు టెలికం శాఖ నడుం బిగించింది.

ఇకపై ఓ ఫోన్‌లో అయితే సిమ్ ఉంటుందో.. అదే ఫోన్‌లో మాత్రం ఆ నంబర్‌తో పని చేసే వాట్సప్, టెలిగ్రామ్ పని చేస్తుంది. సిమ్ తీసేస్తే.. వెంటనే ఆయా మెసెజింగ్ యాప్‌లు కూడా పని చేయడం ఆగిపోతాయి. అదే సమయంలో వాట్సప్, టెలిగ్రామ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది టెలికం శాఖ. క్యూఆర్ కోడ్ స్కాన్‌ చేసి వెబ్ బ్రౌజర్‌తో వాట్సప్, టెలిగ్రామ్ వినియోగించే వారు.. పొరపాటున దానిని లాగవుట్ చేయకుండా మర్చిపోతుంటారు. ఆ తర్వాత ఆ డెస్క్ టాప్ వినియోగించే వారు.. అందులో ఉన్న సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ సమస్యకు టెలికం శాఖ పరిష్కారం తెలిపింది. అలా తెరిచిన ఆరు గంటల్లో దానంతట అదే ఆటోమేటిక్‌గా లాగవుట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలను టెలికం శాఖ ఆదేశించింది.

Also Read : ఖమ్మం జిల్లాలో టీడీపీ సంచలనం..!

భారత్‌లో తెలిసిన వారి ద్వారా సిమ్ కార్డు తీసుకుని.. దానిని ఇతర ఫోన్‌లో అదే నంబర్‌తో వాట్సప్ యాక్టివేట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ నంబర్‌ ఉన్న ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. వాట్సప్, టెలిగ్రామ్ ద్వారానే ఇతర దేశాల నుంచి భారతీయులకు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. టెలికం శాఖ రంగంలోకి దిగింది. ఇకపై సిమ్ ఉన్న ఫోన్‌లోనే వాట్సప్, టెలిగ్రామ్, జియో చాట్, షేర్ చాట్, స్నాప్ చాట్, సిగ్నల్, జోష్ వంటి మెసేజింగ్ యాప్‌లు పని చేయాలని ఆదేశించింది. దీని వల్ల విదేశాల్లో ఉంటూ భారతీయ నంబర్లు వినియోగిస్తున్న వాట్సప్ ఆగిపోనుంది. ఇప్పటికే బ్యాంకుల యాప్‌లు, యూపీఐ పేమెంట్‌ యాప్‌లు ఈ రూల్‌ పాటిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్