Sunday, March 22, 2026 08:32 AM
Sunday, March 22, 2026 08:32 AM

అల్లు అర్జున్ ను వదలని తెలంగాణా పోలీస్

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ విషయంలో తెలంగాణా పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు… బెయిల్ రద్దు చేయించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కు బెయిల్ రాకుండా ఉండేందుకు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తోంది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్‌పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Also Read : కేంద్ర మంత్రి వర్గంలోకి మరో ముగ్గురు తెలుగు నేతలు

గత విచారణలో కౌంటర్‌కి సమయం కోరిన పోలీసులు… నేడు కౌంటర్ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో బయట ఉన్న అల్లు అర్జున్.. తనకు రెగ్యులర్ బెయిల్ కావాలని పిటీషన్ దాఖలు చేసారు. రిమాండ్ గడువు ముగియడంతో ఇటీవల నాంపల్లి కోర్టు విచారణ కు వర్చువల్‌గా అల్లు అర్జున్ హాజరు అయ్యాడు. తదుపరి విచారణ జనవరి 10 కి వాయిదా వేసింది కోర్ట్. ఈనెల 4 న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ప్రాంగణంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read : బాలయ్య కోసం ఎన్టీఆర్.. నాగ వంశీ ప్లానింగ్

13 న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడంతో.. అంతకుముందే హై కోర్టు లో అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ కొనసాగింది. అదే రోజు నాలుగు వారాల సమయంతో మధ్యంతర బెయిల్ ను హై కోర్టు మంజూరు చేసింది చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ బెయిల్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత జనవరి 10న విచారణ జరగనుంది. ఇక ఈ కేసులో మరొకరిని కూడా చేర్చారు పోలీసులు. మైత్రీ మూవీ మేకర్స్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్