పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఓ జీ థియేటర్ లలో సందడి చేస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈసినిమా కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లను రాబడుతోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దానయ్య నిర్మించగా థమన్ సంగీతం అందించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ సినిమా ప్రేక్షకులు కూడా ఈ సినిమాకు మంచి మార్కులు వేస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలవగా కొన్ని సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Also Read : అమరావతికి ముంపు సమస్య ఉందా..?
ఇదిలా ఉంటే సినిమా టికెట్ ధరల విషయంలో కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ‘ఓజీ’ సినిమా టికెట్ ధరలపై తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘ఓజీ’ సినిమా యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. టికెట్ ధరలపై కొంతమందికే అభ్యంతరం ఉందన్న న్యాయవాది నిరంజన్‌రెడ్డి.. ఫైవ్ స్టార్ హోటల్‌లో కాఫీ రూ.500 ఉంటుంది.. దిల్జిత్ షో అంటే లక్షల్లో ధర ఉంటుందని వాదనలు వినిపించారు. ధరలపై నిర్వాహకులకే ఎక్కువ అధికారాలు ఉన్నాయని తెలిపారు.
Also Read : బాలయ్య మాటల మంటలు.. టీడీపీ వర్సెస్ మెగా ఫ్యాన్స్
హైదరాబాద్‌లో అనిరుధ్ షో నిర్వహిస్తే అతడికి నచ్చిన ధర పెడతారని, సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుందని వాదించారు. ‘ఓజీ’ సినిమాను దిల్లీలో చూడాలంటే రూ.1,500 టికెట్ ధర ఉంటుందన్న నిరంజన్‌రెడ్డి.. కేవలం సినిమాపైనే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని కోర్టుకు విన్నవించారు.
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ రూ.1,500 ఉంటే రూ.200కు కావాలని కోర్టుకు ఎందుకు రారు అని ప్రశ్నించారు. దిల్జిత్ షో రూ.10 వేలు ఉంటే రూ.200కే కావాలని కోర్టుకు ఎందుకు రారు అని నిలదీసారు. ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తే వంద లేదా 150 పెంచుకోమని ఉత్తర్వులిస్తారని, రూ.150 కూడా కష్టమనుకుంటే సాధారణ ధర ఉన్నప్పుడే సినిమా చూడాలన్నారు. పిటిషనర్ మొదటి రోజు సినిమా చూడాలంటారు.. నచ్చిన ధరతోనే అంటే ఎలా అని న్యాయమూర్తి సమక్షంలో పిటిషనర్ ను ప్రశ్నించారు.