Wednesday, February 4, 2026 03:34 PM
Wednesday, February 4, 2026 03:34 PM

శ్రీ చరణీ విషయంలో ఇలా.. అరుంధతీ రెడ్డి విషయంలో అలా..?

భారత్ లాంటి దేశాల్లో క్రీడలను ప్రోత్సహించే విషయంలో ప్రభుత్వాలు గతంలో వెనకడుగు వేసిన పరిస్థితి ఉండేది. అయితే క్రమంగా పరిస్థితి మారుతూ క్రీడల వైపు యువతను నడిపించడంలో.. ప్రభుత్వాలు తమ వంతు పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత పదేళ్ల నుంచి క్రీడారంగంపై ఫోకస్ పెట్టాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నుంచి అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఉమెన్ క్రికెటర్ శ్రీచరణీ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నగదు ప్రోత్సాహం కూడా అందించింది.

Also Read : సీబీఐ.. అప్పుడు వద్దు.. ఇప్పుడు కావాలి..!

ఇక ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు మంత్రులు వెళ్లడం ఆశ్చర్యపరిచే విషయమే. అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ కప్ జట్టులో భాగమైన అరుంధతి రెడ్డి అనే మహిళా క్రికెటర్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్ లలో ఒకటి కూడా ఆడకపోయినా.. రిజర్వ్ ప్లేయర్ గా తన వంతు పాత్ర పోషించింది అరుంధతి రెడ్డి. పేస్ ఆల్ రౌండర్ గా జట్టులో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఆమె నేరుగా హైదరాబాద్ వచ్చారు.

Also Read : అమెరికా ఆశలు గల్లంతు.. ఫ్యామిలీ హెల్త్ పై ఫోకస్.. వీసాలు కష్టమే..!

కానీ ఆమెకు స్వాగతం పలికేందుకు మాత్రం ఎవరు వెళ్లలేదు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మినహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఎవరు వెళ్లిన పరిస్థితి లేదు. ఇక ప్రభుత్వం కూడా ఆమెపై అంత ఫోకస్ చేయలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం గురించి తెలుసుకోలేదని సమాచారం. అటు అధికారులు కూడా రేవంత్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే విమర్శలు రావడంతో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి.. ఆమెను తన నివాసానికి ఆహ్వానించి సన్మానించారు. కానీ ఎటువంటి నగదు పురస్కారం గాని, ఇంటి స్థలం వంటివి మంజూరు చేయలేదు. గతంలో మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ వంటి వాళ్లకు సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వం.. అరుంధతి రెడ్డి విషయంలో మాత్రం వెనకడుగు వేసిందని విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్