పేరుకే అగ్ర జట్టు.. కానీ జట్టులో ఎన్నో లోపాలు. స్వదేశంలో మినహా విదేశాల్లో సరైన సీరీస్ జరిగితే ప్రదర్శనలో ఎన్నో లోపాలు. మీడియా హడావుడి మినహా భారత జట్టు సమర్ధవంతంగా లేదనేది స్పష్టంగా అర్ధమవుతోంది. లక్షలాది మంది ఆటగాళ్ళు క్రికెట్ ఆడుతున్నా సరే సమర్ధవంతమైన బౌలర్లను నలుగురిని వెతికి పట్టుకోవడం జట్టుకు కష్టంగా మారడం కామెడిగా ఉంది. జహీర్ ఖాన్, అనీల్ కుంబ్లే, అశ్విన్, వెంకటేష్ ప్రసాద్, అగార్కర్ వంటి బౌలర్లు రిటైర్ అయిన తర్వాత భారత జట్టుకు ఉన్న ఒకే ఒక్క దిక్కు బూమ్రా.
Also Read : భారత్ కు బూమ్రా షాక్.. రెండో టెస్ట్ లో కష్టమే
జడేజా స్వదేశంలోనే సమర్ధవంతంగా ఆడటం మినహా విదేశాల్లో డొల్ల. సిరాజ్ కొత్త బంతితో మినహా పాత బంతితో బౌలింగ్ చేయలేని పరిస్థితి. షమీని గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఇంకో 4 టెస్ట్ లు ఉన్నాయి. ఈ నాలుగు మ్యాచ్ లలో బ్యాటింగ్ లో భయం లేదు గాని బౌలింగ్ లోనే భయాలు అన్నీ. బూమ్రా మినహాయిస్తే ఏ ఒక్క బౌలర్ కూడా సమర్ధవంతంగా కనపడటం లేదు. బూమ్రా కూడా 5 టెస్ట్ లు ఆడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో రాజకీయాలు కూడా చికాకు పెడుతున్నాయి.
Also Read : మళ్లీ తెరపైకి బిర్యానీ వార్..!
గుజరాత్ టీంలో ఆడిన బౌలర్లతో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభించడం కామెడీగా అనిపించింది. అవకాశం వచ్చిన ప్రతీసారి దుమ్ము రేపే అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ ను పక్కన పెట్టారు. ఆకాష్ దీప్, అన్షుల్ కాంబోజ్ లాంటి బౌలర్లకు అవకాశం ఇవ్వడానికి కోచ్ సిద్దంగా లేడు. ఇవన్నీ జట్టులో చికాకుగా మారాయి. బూమ్రా లేకపోతే ప్రత్యర్ధులు టెస్ట్ లో భారత బౌలింగ్ విభాగాన్ని ఒక ఆట ఆడుకుంటారు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. మరి రాజకీయాలు పక్కన పెట్టి జట్టును బలపరుస్తారో లేదో చూడాలి.




