తెలంగాణలోని పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టుదలగా ఉన్నారా..? అంటే అవుననే సంకేతాలు కనపడుతున్నాయి. 2004 నుంచి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలో లేకపోయినా సరే కార్యకర్తలు మాత్రం.. పార్టీ జెండా వీడలేదు. ఎంతమంది నాయకులు పార్టీ మారినా సరే కార్యకర్తలు మాత్రం.. గ్రామాల్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ జెండాలు కడుతూనే ఉన్నారు. 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పై అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన టిడిపి కార్యకర్తలు.. వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని నిర్ణయం తీసుకున్నారు.
Also Read : హైదరాబాద్ లో బెజవాడ మైనర్లు సంచలనం..!
ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలంగానే ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో సైతం టిడిపి క్యాడర్ ఇంకా ఆ పార్టీని అంటిపెట్టుకొని ఉంది. దీనితో గ్రామాల్లో.. ఉన్న నాయకులు పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి హడావిడి లేకుండా పోటీలో నిలుస్తున్నారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఖమ్మం జిల్లాలో 9 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముందు నుంచి తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతూనే ఉంది. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకంగా తొమ్మిది గ్రామాలను ఏకగ్రీవం చేసుకోవడం సంచలనమే.
Also Read : ట్రాఫిక్ కష్టాలకు జీహెచ్ఎంసీ ప్లాన్ అదుర్స్
దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో పాటుగా పాలేరు, సత్తుపల్లి, అశ్వరావుపేట సహా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి క్యాడర్ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించింది. రాష్ట్ర పార్టీ నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోయినా.. అధిష్టానం పోటీకి ఇష్టపడకపోయినా.. కార్యకర్తలు మాత్రం గ్రామాల్లో పార్టీని బతికించుకునేందుకు తీవ్రంగా ఇప్పటికి కష్టపడుతూనే ఉన్నారు. సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో టిడిపి నాయకత్వం పంచాయతీ ఎన్నికలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది. పరిషత్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని.. క్యాడర్ అడుగులు వేస్తోంది.

