Friday, September 12, 2025 07:11 AM
Friday, September 12, 2025 07:11 AM
roots

సొంత కార్యకర్తపై టిడిపి కఠిన చర్యలు.. ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు?

తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం తమ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ వ్యాఖ్యల పై తీవ్రంగా స్పందించింది. వైఎస్ భారతిపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం, కిరణ్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని ఎంతటివారైనా ఉపేక్షించబోమని టీడీపీ తేల్చి చెప్పింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన కిరణ్‌పై కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ అధిష్ఠానం గుంటూరు పోలీసులను ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశం మేరకు కేసు నమోదు చేసి కిరణ్ ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని సమాచారం.

Also Read : వైసీపీకి జీవం పోస్తున్న టీడీపీ నేతలు.. ఇలా అయితే ఎలా..?

ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాను గౌరవప్రదమైన రీతిలో ఉపయోగించాలనే పార్టీ సందేశాన్ని ఈ చర్య బలంగా చాటుతోందని కొందరు అభిప్రాయపడుతుంటే.. ఇలాంటి చర్యలు ముందు వైసీపీ నాయకులు, కార్యకర్తల పై తీసుకుని అప్పుడు టిడిపి వారిపై తీసుకోవాలని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ గమనార్హం ఏమిటంటే, గతంలో వైకాపా శాసనసభ్యులు సభలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులైన మహిళలను అవమానకరంగా మాట్లాడినప్పుడు, సభలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఖండించకపోగా ఆనందించారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు, ఎమ్మెల్యేలు అత్యంత నీచంగా మాట్లాడితే జగన్ వెకిలి నవ్వులు నవ్వి వాళ్ళని ప్రోత్సాహించాడు అంతేకాకుండా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆధ్వర్యంలో వైకాపా సోషల్ మీడియా నిత్యం అసభ్యకరమైన పోస్టులతో రెచ్చిపోయింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటూ టిడిపి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : సజ్జలకు జగన్ బిగ్ షాక్.. మరో రెడ్డికి అగ్ర తాంబూలం

వీరే కాకుండా పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డి వంటి వారితో సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేయించారు. వైఎస్ భారతి గారి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్ర రెడ్డి సైతం జగన్ సొంత కుటుంబ సభ్యులను, తల్లిని కూడా విడిచిపెట్టకుండా దారుణమైన పోస్టులు పెట్టారు. స్వయంగా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారు చంద్రబాబును కించపరిచేలా షర్మిల పసుపు చీర కట్టుకుని వెళ్లారంటూ నీచంగా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో, చేబ్రోలు కిరణ్ ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసినప్పటికీ, టీడీపీ తీసుకున్న ఈ అరెస్టు నిర్ణయం కేవలం టీడీపీ కార్యకర్తలకే కాకుండా, అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా వైకాపా యొక్క బూతు మీడియాకు ఒక స్పష్టమైన హెచ్చరికను పంపుతోంది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ చర్య ద్వారా టీడీపీ గట్టిగా చాటి చెప్పింది. ఈ పరిణామం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్