Tuesday, October 28, 2025 06:56 AM
Tuesday, October 28, 2025 06:56 AM
roots

వైసీపీకి మరో షాక్ సిద్ధం..?

వైసీపీని కష్టాలన్నీ ఒక్కసారే చుట్టేస్తున్నాయి. అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తామని వైసీపీ అధినాయకత్వం వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తోంది. కానీ ప్రస్తుతం వైసీపీ పరిస్థితి చూస్తే మాత్రం అత్యంత దారుణంగా తయారైంది. వైసీపీ చేస్తున్న వ్యాఖ్యలను కూటమి సర్కార్ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. ఇక ఉన్న నాలుగేళ్ల పదవీ కాలంలో వైసీపీ పూర్తిగా బలహీనపడేలా ఒక్కొక్క అడుగు వేస్తోంది. వై నాట్ 175 అని.. అసెంబ్లీలో ప్రతిపక్షమే ఉండకూడదని గొప్పలు చెప్పిన జగన్‌కు చివరికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేశారు. ఇక మండలిలో కూడా ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి.

Also Read : ఎవరీ ధనుంజయ రెడ్డి.. జగన్ తో ఏమా బంధం..?

ఇదిలా ఉంటే ఈసారి మహానాడు జగన్ సొంత ఇలాకా కడపలో టీడీపీ నేతలు గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. వైసీపీ కూసాలు కదిలిపోవాలనే లక్ష్యంతో టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. టార్గెట్ వైసీపీ అన్నట్లుగా అడుగులు వేస్తున్న టీడీపీ నేతలు.. మహానాడు వేదికగా ‌జగన్‌కు ఊహించని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ నుంచి పలువురు ముఖ్య నేతలు టీడీపీలో చేరేందుకు అధినాయకత్వం మంతనాలు చేస్తోంది. భారీ స్కెచ్ గీసి మరీ వైసీపీని దెబ్బ కొట్టే పనిలో టీడీపీ నేతలు బిజీగా ఉన్నారు.

Also Read : ఐఎస్ఐ ఎలా పని చేస్తుంది..? పాక్ గూడచారి సంస్థ సంచలన విషయాలు

మహానాడులో ఎవరూ ఊహించని విధంగా పెద్ద నాయకులే సైకిలెక్కుతారనే ప్రచారం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్‌లో బాగా వినిపిస్తోంది. ఇలా పార్టీ మారే నేతల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనేతలు కూడా ఉన్నారనే మాట వినిపిస్తోంది. అయితే ఆ నేతలెవరనే విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీకి 2024 ఎన్నికల నాటికి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అందులో నలుగురు ఇప్పటికే పార్టీని వీడిపోయారు. ఇక మిగిలిన వారిలో వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాధరెడ్డి, ఆళ్ళ అయోధ్యా రామిరెడ్డి, పరిమళ్ నత్వనీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ పదివీ కాలం మరో ఏడాది మాత్రమే ఉంది. వైవీ సుబ్బారెడ్డి జగన్‌కు సొంత బాబాయి.. కాబట్టి ఆయన కూడా పార్టీ మారే పరిస్థితి లేదు. మరి మిగిలిన ముగ్గురి విషయంలోనే ఇప్పుడు చర్చ జోరుగా జరుగుతోంది.

Also Read : భారత్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్..?

జగన్‌కు నిరంజన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. ఆయన జగన్‌ కేసులను కూడా వాదిస్తున్నారు. పలు చిత్రాలకు నిర్మాత కూడా. జగన్‌ విషయం పూర్తిగా తెలిసిన వ్యక్తి. కాబట్టి ఆయన పార్టీ మారేంత ధైర్యం చేయలేరంటున్నారు. ఇక మిగిలిన ఇద్దరు గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి. ఈ ఇద్దరికీ 2030 వరకు పదవీ కాలం ఉంది. వచ్చే ఎన్నికల వరకు కూడా వీరిద్దరు ఎంపీలుగానే ఉంటారు. కడప జిల్లాకు చెందిన మేడా రఘునాధరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. సొంత జిల్లాలోనే జగన్‌కు గట్టి షాక్ ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. వాస్తవానికి మేడా రఘునాధరెడ్డి కూడా గతంలోనే పార్టీని వీడనున్నట్లు గట్టిగానే ప్రచారం జరిగింది. మరి మేడా రఘునాధరెడ్డి సైకిల్ ఎక్కుతారా లేదా తెలియాలంటే మహానాడు వరకు ఆగాల్సిందే.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్