Sunday, March 22, 2026 06:19 AM
Sunday, March 22, 2026 06:19 AM

టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్‌.. ఇవే కీలకం..!

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి జరుగుతున్న పాలిట్ బ్యూరో సమావేశం.. ఈసారి ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సభ్యత్వ కార్యక్రమం.. కోటికి చేరుకోవడంతో, సంస్ధాగత నిర్మాణంపై పార్టీ దృష్టి సారించనుంది. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలకు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. సంస్ధాగతంగా తీసుకురావాల్సిన సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. నియామక పదవులపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

Also Read : ఏపీలో అన్నీ ఇక వాట్సాప్ లోనే…!

రాష్ట్రంలో ఉన్న పొలిట్ బ్యూరో సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈ భేటీలో ప్రధానంగా కార్యకర్తల కృషితో సభ్యత్వం కోటికి చేరుకోవడంపై కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించిన అంశాన్ని కూడా లోకేష్ వివరించనున్నారు. సభ్యత్వ కార్యక్రమం పూర్తి కావడం, ఇక గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ సంస్ధాగత నిర్మాణం చేపట్టాలని నిర్ణయించనున్నారు. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.

Also Read : పుష్పకు హ్యాండిచ్చిన త్రివిక్రమ్..?

అలాగే పార్టీలో సంస్థాగతంగా సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని, ఒక వ్యక్తి ఒకే పదవిలో రెండుసార్లుకు మించి పని చేయకూడదని, పదవులు అన్నింటిలో కూడా అందరూ పని చేసే విధంగా చూడాలని మంత్రి లోకేష్‌ ఇటీవలే విశాఖలో వ్యాఖ్యానించారు. అదే విధంగా పొలిట్‌ బ్యూరోలో కూడా 30 శాతం మంది కొత్తవారు వచ్చే విధంగా చూడాలని కూడా లోకేష్‌ తెలిపారు. వీటిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి నుంచి.. అంటే గ్రామస్థాయి నుంచి ఎన్నికలు నిర్వహించాలని అధినాయకత్వం భావిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థాగత ఎన్నికలు వెంటనే చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 8 నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలతో పాటు, పార్టీ నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్లే విధంగా చూడాలని ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను కూడా పొలిట్‌ బ్యూరోలో చర్చించి నిర్ణయించనున్నారు.

Also Read : టిడ్కో ఇళ్ళ వెనుక విధ్వంసం బయటపెట్టిన మంత్రి…!

దీంతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నియామక పదవులను భర్తీ చేస్తూ వచ్చారు. మరికొన్ని పదవులు కూడా ఇంకా మిగిలే ఉన్నాయి. అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతోంది. వీటితో పాటు, మార్కెట్ యార్డు, దేవస్థానం పాలక వర్గాలు, ఇతర పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటిపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాది జూన్ నాటికి నియామక పదవులన్నిటినీ భర్తీ చేస్తామని కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసులు అరెస్టు చేసి, లాఠీ దెబ్బలు తినడంతో పాటు, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అనేక మందికి ఇంకా పదవులు ఇవ్వాల్సి ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే రాబోయే వారం రోజుల్లో నాలుగో విడత నియామక పదవుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా పొలిట్‌ బ్యూరోలో సీఎం స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.

రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలలో కూటమి పక్షాల మధ్య సమన్వయ లోపంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. పదవుల పంపిణీ, దేవాలయాలు, మార్కెట్ యార్డుల పాలక వర్గాల నియామకాల్లో కూడా కూటమిలోని జనసేన, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా సీఎం పాలిట్ బ్యూరో సమావేశంలో నేతలకు చెప్పే అవకాశం ఉంది. నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ సమన్వయం ఉండాలని సీఎం సూచించనున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్