Friday, September 12, 2025 05:12 PM
Friday, September 12, 2025 05:12 PM
roots

ఇంకా చాలు.. టీడీపీ నేతలకు అధిష్టానం వార్నింగ్…!

ఏపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రభుత్వంలో కీలక పదవి కావాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ లు చేస్తున్నారు. ఇది క్రమంగా తీవ్రంగా మారుతున్న నేపధ్యంలో పార్టీ అధిష్టానం చర్యలకు దిగింది. లోకేష్ డిప్యూటీ సీఎం కామెంట్స్ పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులకు టిడిపి హై కమాండ్ హెచ్చరికలు పంపింది. కూటమిపాలసిలో లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని నిర్ణయమేమీ లేదని స్పష్టం చేసింది. అధికార ప్రతినిధులు కానీ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ అంశంపై మాట్లాడవద్దు అంటూ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : వైసీపీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజేపి, జనసేన

ముగ్గురు నలుగురు మాట్లాడిన మాటలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇటువంటి మాటలు మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది పార్టీ అధిష్టానం. కూటమిలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవహరించాలని.. చంద్రబాబు పార్టీ నాయకులు ఆదేశాలు ఇచ్చారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అనే ప్రచారానికి టిడిపి నేతలు ఫుల్ స్టాఫ్ పెట్టాలని హెచ్చరించింది. ఈ అంశంపై మాట్లాడిన నేతలకు.. అలాగే పార్టీ నేతలు అందరికి దీనిపై కీలక ఆదేశాలు వెళ్ళాయి.

Also Read : పోలవరం కీలక ఘట్టం.. డయాఫ్రం వాల్ ప్రత్యేకతలు ఇవే…!

మీడియా ముందు మాట్లాడే మాటలపై జాగ్రత్తగా ఉండాలని.. అనవసరంగా లేనిపోని సమస్యలకు ఆజ్యం పోయవద్దని టిడిపి కేంద్ర కార్యాలయం హెచ్చరించింది. ఏ నిర్ణయమైనా కూటమి అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకుంటారని స్పష్టంగా తేల్చిచెప్పింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని సీరియస్ అయింది. ఇటీవల కడప జిల్లా నేత శ్రీనివాసులు రెడ్డి, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ మంత్రి సోమిరెడ్డి సహా పలువురు నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ డిమాండ్ చేసారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్