బెజవాడ ఆటో నగర్.. ఆరు రోడ్లు, ప్రతి ఏటా నాలుగువేల కోట్ల రూపాయల వ్యాపారం, తెలుగు రాష్ట్రాల్లో ఏ లారీ కొన్నా బాడీ కట్టించే నమ్మకమైన ప్లేస్.. తెలుగు రాష్ట్రాల ఆటోమొబైల్ రంగానికి గుండెకాయ.. సెకండ్ హ్యాండ్ టైర్లు, లారీలు, భారీ క్రేన్ లు, రకరకాల మెషిన్లు.. నిత్యం వందలాది మందితో కళకళలాడే అల్ట్రా ప్రో మాక్స్ ఆటోమొబైల్ మార్కెట్. ఇదంతా బెజవాడ ఆటోనగర్ గురించి గొప్పలు చెప్పడానికి వాడే మాటలు. ఏదో లారీ కొని, లేదా పాడైన లారీని బాగు చేయించుకోవడానికి, ఏదో ఒక పని మీద ఆటోనగర్ వచ్చేవాళ్లకు ఆటోనగర్ కారణంగా బెజవాడ వాసుల కష్టాలు తెలియదు.
Also Read : టీడీపీ తో పొత్తుపై పవన్ కీలక కామెంట్స్
ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పటమట, కానూరు, ఆర్టీసీ కాలనీ, మురళి నగర్, గురు నానక్ కాలనీ, రామవరప్పాడు నుంచి ఎనికెపాడు వరకు నేషనల్ హైవే పరిసర ప్రాంతాలు, అశోక్ నగర్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రాంత వాసులందరికీ ఆటోనగర్ ఎన్నో చేదు జ్ఞాపకాలు ఇస్తూనే ఉంది. చెత్త కాలుష్యం, నీటి కాలుష్యం వంటి సమస్యలు ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం చూపించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. ఆటోనగర్ లో పేరుకుపోయిన టన్నుల కొద్ది చెత్తను అధికారంలో వచ్చిన తర్వాత తొలగించే కార్యక్రమం చేపట్టింది. సనత్ నగర్ నుంచి మురళి నగర్ వరకు చెత్తతో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
Also Read : చెవిరెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి.. నలిగిపోతున్న జగన్..!
అటువైపు వెళ్ళాలి అంటే సాహసం కూడా చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని శుద్ధి చేసేందుకు ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఆటోనగర్ నీటి కాలుష్యం సమస్యను పరిష్కరించేందుకు.. కృష్ణానది నీటిని వాడుకోవాలని భావిస్తోంది. వర్షాకాలం వస్తుందంటే చాలు ఆటోనగర్ వెళ్లాలంటే భయపడి పోయే పరిస్థితి. నిండా చెత్త తో పాటుగా ఎక్కడికక్కడ చెరువులను తలపిస్తూ ఉంటాయి రోడ్లు. ఈ ప్రభావం పైన పేర్కొన్న ప్రాంతాలపై కూడా తీవ్రంగా పడుతోంది. ఆటోనగర్ 100 అడుగుల రోడ్ లో వర్షాకాలం ట్రాఫిక్ సమస్య కూడా వెంటాడుతోంది. దీనితో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించి.. ఆసియాలోనే అతిపెద్దదైన ఆటోనగర్ ను.. అందంగా ముస్తాబు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఆటోనగర్ కారణంగా దాదాపు 40 శాతం బెజవాడ ప్రభావం పడుతుంది. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చొరవతో ప్రభుత్వం వేగంగా చర్యలు మొదలుపెట్టింది.

