ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశామని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం అధికారంలోకి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి తమ ప్రభుత్వం చేసిన మంచి గురించి వివరించాలని చంద్రబాబు సూచించారు. తొలి అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా పర్యటనలు కూడా ప్రారంభించారు. అటు చంద్రబాబు కూడా తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో తొలి అడుగు ప్రారంభిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో ఇంటింటికి తొలి అడుగు చేపట్టారు. అయితే ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది.
Also Read : కేంద్రం బాబుకి నిజంగా షాక్ ఇచ్చిందా..?
ఏపీలో 3 పార్టీలు కలిసే పోటీ చేశాయి. అందుకే ఎన్డీయే కూటమికి 164 సీట్లు వచ్చాయనేది అటు జనసేన, ఇటు బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న మాట. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అలాగే జనసేన కూడా 21 స్థానాల్లో పోటీ చేసి అన్ని గెలుచుకుంది. ప్రభుత్వం చేపడుతున్న అన్ని కార్యక్రమాల్లో 3 పార్టీలకు చెందిన మంత్రులు పాల్గొంటున్నారు. జనసేన తరఫున కందుల దుర్గేష్, బీజేపీ తరఫున సత్యకుమార్ యాక్టివ్‌గా ఉన్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన తొలి అడుగు పర్యటనలకు జనసేన, బీజేపీ నేతలు దూరంగా ఉన్నారు. తొలి అడుగు సీఎం హోదాలో చంద్రబాబు ప్రారంభిస్తుంటే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన, బీజేపీ నేతలు ఎక్కడా కనిపించటం లేదు. దీంతో ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే టాపిక్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
Also Read : షెఫాలి మరణానికి యాంటీ ఏజింగ్ మందులే కారణమా..?
ఏడాది కాలంలో ప్రభుత్వం ఎంతో సాధించిందని కూటమి నేతలు రోజూ చెబుతున్నారు. చేసింది ప్రజల్లోకి వెళ్లి చెప్పుకోవాలని.. అలా ప్రచారం చేసుకోలేదు కాబట్టే.. 2019లో ఓడిపోయామని చంద్రబాబు వెల్లడించారు కూడా. అందుకే ఈ సారి మాత్రం చేసిన ప్రతి మంచి పనిని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఇందు కోసమే తొలి అడుగు పేరుతో పార్టీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లేలన్నారు. అయితే, ఈ కార్యక్రమం టీడీపీ సోలోగా నిర్వహిస్తోంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన, బీజేపీలకు చెందిన నేతల్లో ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడా కనిపించటం లేదు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు.. ఎక్కడ కూడా బీజేపీ, జనసేన నేతలు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఎన్నికలప్పుడు 3 పార్టీల కండువా వేసుకుని వచ్చిన నేతలు.. సరిగ్గా ఏడాదికే సింగిల్‌గా రావటం ఏమిటనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది.
Also Read : సిఎం వర్సెస్ డిప్యూటి సిఎం.. కన్నడ నాట ఏం జరుగుతోంది..?
ప్రభుత్వం సాధించిన విజయాలు మూడు పార్టీలతో ఏర్పడిన కూటమికి దక్కుతుందని తొలి నుంచి 3 పార్టీలు చెబుతున్నారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందని బీజేపీ నేతలు పదే పదే చెబుతున్నారు. అలాగే ప్రభుత్వంలో తామూ కూడా భాగస్వామ్యులమే అని.. కాబట్టి నామినేటెడ్ పదవుల్లో తమకు కూడా మెజారిటీ వాటా ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ఇక బీజేపీ ఏపీ అధ్యక్షుని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. బీజేపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కావాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో.. టీడీపీ అభిమానులు కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. పదవులు కావాలని అడుగుతున్న నేతలు తొలి అడుగు పేరు కార్యక్రమానికి ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ, జనసేన అభిమానులు కూడా ధీటుగానే జవాబిస్తున్నారు. కూటమిలోని మొత్తం 164 ఎమ్మెల్యేలతో నిర్వహించాల్సిన తొలి అడుగు సన్నాహక సమావేశాన్ని టీడీపీ మాత్రమే ఎందుకు నిర్వహించిందంటున్నారు. ఈ కార్యక్రమానికి కూటమిలోని మిగిలిన పార్టీల నేతలను ఎందుకు పిలవలేదంటున్నారు. ఒంటరిగా సమావేశం పెట్టుకుని.. కార్యక్రమంలో ఇతర పార్టీల నేతలు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నిస్తారని నిలదీస్తున్నారు. తొలి అడుగు కార్యక్రమంపై ఇతర పార్టీల నేతలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదంటున్నారు.
Also Read : రేవంత్ రెడ్డి – ఆరా మస్తాన్ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలతో బయటపెట్టిన సిట్
మరోవైపు ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలనలో హామీల విస్మరణ, వైఫల్యాల పైన వైసీపీ ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సమయంలో కూటమిలో పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను 3 పార్టీల నేతలు ప్రజల్లోకి వెళ్లి వివరించాల్సి ఉంది. కానీ టీడీపీ నేతలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లటం ఏమిటనే చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా కూటమి సర్కార్ వైఫల్యం అంటూ 3 పార్టీలను కలిపే నిందిస్తున్నారు. దీనిపై కూడా జనసేన, బీజేపీ నేతలు ఇప్పటి వరకు స్పందించలేదు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ హామీలను 3 పార్టీలు కలిపే ఇచ్చాయి. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేవలం టీడీపీ నేతలు మాత్రమే ప్రజల్లోకి వెళ్లడం వల్ల కూటమిలో చీలికలు వచ్చాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. కలిసి కట్టుగా ప్రజల్లోకి వెళ్లటంతో సానుకూల సంకేతాలు వెళ్తాయని.. ఇప్పుడు వేర్వేరుగా ఉండటం ద్వారా కొత్త సందేహాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందనేది విశ్లేషకుల మాట. ఈ కార్యక్రమానికి బీజేపీ, జనసేన పార్టీలు దూరంగా ఉండటం పైన కూటమి నేతలు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

