Sunday, March 22, 2026 09:13 AM
Sunday, March 22, 2026 09:13 AM

ఏపీ రియల్ రంగానికి బూస్ట్..? మారుతోన్న పరిస్థితి..!

ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు రియల్ ఎస్టేట్ రంగం ఎన్నో ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అమరావతి విషయంలో నాటి సిఎం వైఎస్ జగన్ అనుసరించిన వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రాజకీయంగా ఉన్న లక్ష్యాలతో అమరావతిని జగన్ నాశనం చేయాలి అనుకోవడం అప్పట్లో సంచలనం అయింది. అయితే టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ అమరావతి విషయంలో వేసిన అడుగులకు ఇప్పుడు ఫలితం కనపడుతోంది. గత ఏడాదిన్నరగా లేని కదలిక ఇప్పుడు వస్తోంది.

Also Read : బ్రేకింగ్: ప్రకాశం జిల్లాలో కీలక మార్పులు

ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చినప్పటి నుంచి పరిస్థితిలో మార్పు కనపడుతోంది. గూగుల్ సహా పలు కంపెనీలు విశాఖ వెళ్ళడం, ఐటీ రంగం మొత్తాన్ని విశాఖలోనే ఏర్పాటు చేసే విధంగా సర్కార్ అడుగులు వేయడంతో అమరావతిపై ఆందోళన మొదలైంది. అయితే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం దూకుడు, అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో వాతావరణం మారిపోయింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో సైతం రియల్ రంగం వేగం అందుకుంది. గుంటూరు సమీప ప్రాంతాల్లో కూడా కదలిక వచ్చింది అనే చెప్పాలి.

Also Read : సినిమా రేటింగ్‌లో అక్రమాలు..!

సిఆర్డిఏ బిల్డింగ్ నిర్మాణం తర్వాత.. బ్యాంకులు సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపనలు జరిగాయి. రెండవ దశ భూ సేకరణ విషయంలో ముందు వ్యతిరేకత వచ్చినా పనులు పూర్తి స్థాయిలో మొదలుకావడంతో రియల్ రంగానికి కొంత ఊపు వచ్చింది. అయితే ధరలు కూడా కొంత వేగంగా పెరుగుతున్నాయనే విమర్శ సైతం ఉంది. గజం 20 వేలు కూడా ఉండని ప్రాంతాల్లో 35 వేలకు పైగా చెప్తున్నారనే విమర్శ కూడా వినపడుతోంది. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో.. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో సైతం కదలిక పెరిగింది అనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్