Saturday, October 10, 2026 05:20 PM
Saturday, October 10, 2026 05:20 PM

బ్రేకింగ్: రెండు రోజుల్లో పవన్ – విజయ్ భేటీ..!

దక్షిణాది రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఒక అరుదైన పరిణామం అక్టోబర్ 13న విజయవాడ వేదికగా చోటుచేసుకోబోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ వచ్చే మంగళవారం ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న ప్రస్తుత కీలక నేతలు.. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలలో కీలక స్థానాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

దీనితో పవన్ కళ్యాణ్, విజయ్ ల ఈ భేటీ జాతీయ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉన్నత స్థాయి పర్యటన వెనుక ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న దీర్ఘకాలిక జల వివాదాల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఉందని తెలుస్తోంది. తెలుగు గంగ ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం తమిళనాడుకు అందాల్సిన కృష్ణా జలాల వాటాలో భారీగా కొరత ఏర్పడటంపై సీఎం విజయ్ ఏపీ ప్రభుత్వంతో నేరుగా చర్చించనున్నారు. అక్టోబర్ 9 నాటికి తమిళనాడుకు కేవలం 2.251 టుఎంసీల నీరు మాత్రమే అందడంతో మిగిలిన నీటిని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరనున్నారు.

దీనితో పాటు తమిళనాడు సరిహద్దుల్లో ప్రవహించే నదులపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన నయా డ్యామ్‌ల నిర్మాణంపై మరియు నదుల అనుసంధానంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో విజయ్ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ పర్యటనకు ఆధ్యాత్మికంగానూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 13న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవాలని ఏపీ కూటమి ప్రభుత్వానికి చెందిన ఎంపీల బృందం ఇప్పటికే చెన్నై వెళ్లిన తమిళనాడు సీఎం విజయ్ ను ఆహ్వానించింది. అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు విజయ్ వస్తున్న అదే రోజున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నీటి వాటాలపై కీలక చర్చలు జరగనుండటంతో అటు అటూ సినీ అభిమానుల్లోనూ ఇటు రాజకీయ వర్గాలలోను ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బీసీ రిజర్వేషన్లపై ఏపీ...

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక...

జగన్ అక్రమాస్తుల కేసుల్లో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల...

తిరుమల నడక దారి...

తిరుమల కొండకు కాలిబాటన వచ్చే భక్తుల...

సచివాలయ ఉద్యోగుల గుండెల్లో...

ఇటీవల విజయవాడలో ఆందోళన నిర్వహించిన గ్రామ,...

విశాఖ బ్రాండ్ మార్పు.....

హైదరాబాద్‌కు సైబరాబాద్ ఉన్నట్లు విశాఖకు ఇప్పుడు...

గెలుపు కాదు.. ఓట్లు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీల సందడి...

పోల్స్