Wednesday, February 4, 2026 08:21 AM
Wednesday, February 4, 2026 08:21 AM

ఆ విషయంలో ఇద్దరు సీఎంలు ఒకటే..!

రాష్ట్రంలో గవర్నర్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు తరచూ వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ గవర్నర్‌గా వ్యవహరించిన తమిళి సై తీరుపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేశారు. బిల్లులు ఆమోదించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ రాష్ట్ర గవర్నర్‌ తీరుపై అసహనం వ్యక్తం చేస్తోంది. గవర్నర్ అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. కేవలం రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేయాలి. కానీ కర్ణాటక గవర్నర్ ప్రవర్తనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్రుగా ఉంది.

రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి, మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించి, స్వయంగా రూపొందించిన ప్రసంగాన్ని గవ్నరర్ అసెంబ్లీలో చదివారు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున కేవలం రెండు లైన్లు మాత్రమే చదివిన గవర్నర్.. అక్కడ నుంచి వెళ్లిపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Also Read : మరోసారి బయటపడిన జగన్ డబుల్ డైలాగ్..!

సంవత్సరం మొదటి ఉమ్మడి సమావేశంలో మంత్రివర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదవకపోవడం ద్వారా, గౌరవనీయులైన కర్ణాటక గవర్నర్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. ఈ చర్య ఎన్నికైన ప్రతినిధుల సభను అవమానించడమే. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, తగిన చర్చ తర్వాత, సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై నిర్ణయం తీసుకోబడుతుంది.. అంటూ లేఖ రాశారు. ప్రతి సంవత్సరం ప్రారంభంలో, కొత్త ప్రభుత్వం ఏర్పాటు సమయంలో నిర్వహించే సంయుక్త సమావేశంలో ప్రసంగించడం గవర్నర్ రాజ్యాంగ విధి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163 ప్రకారం, మంత్రి మండలి రూపొందించిన ప్రసంగాన్ని చదవడానికి గవర్నర్ కట్టుబడి ఉంటారు. దానిని తన సొంత ప్రసంగంతో భర్తీ చేసే అధికారం గవర్నర్‌కు లేదు కూడా. రాజ్యాంగం ఆమోదించబడినప్పటి నుండి ఇది స్థాపించబడిన రాజ్యాంగ ఆచారం అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మొదటి ఉమ్మడి సమావేశం, ప్రత్యేక సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేసి, దాని స్థానంలో వికసిత్ భారత్ – రోజ్‌గర్ ఔర్ అజీవిక మిషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ చర్యను తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కొత్త చట్టం మహాత్మా గాంధీ పేరును తొలగించింది. అలాగే మునుపటి చట్టంలోని ప్రధాన హామీలను నీరుగారుస్తుంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆహార హక్కు, సమాచార హక్కు, విద్యా హక్కు, పని హక్కుతో సహా హక్కుల ఆధారిత చట్టాలను రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా రూపొందించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కనీసం 100 రోజుల ఉపాధిని నిర్ధారించింది. దళితులు, మహిళలు, కార్మికులు, చిన్న రైతులకు ప్రయోజనం చేకూర్చింది.

కొత్త చట్టం ప్రకారం, శ్రామిక శక్తిలో మహిళలు 53%, దళితులు 28% ఉన్నప్పటికీ, ఖచ్చితమైన ఉపాధి హామీ లేదు. గతంలో, కార్మికులు ఇష్టపడే ప్రదేశాలలో ఉపాధిని పొందవచ్చు. చిన్న రైతులు వారి స్వంత భూమిలో పని చేయవచ్చు. నిర్ణయం తీసుకునే అధికారం గ్రామసభలు, పంచాయతీలకు ఉండేది. సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఉపాధి కల్పించవచ్చు. కేంద్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలను కేంద్రీకరించడంతో ఈ హక్కులు, వికేంద్రీకృత అధికారాలు ఇప్పుడు తొలగించినట్లు అయ్యిందని సిద్ధరామయ్య ఆరోపించారు. గవర్నర్ ఈ కొత్త చట్టాన్ని సమర్థించుకోవడానికి, తనకు స్వాతంత్ర్యం లేనట్లుగా వ్యవహరించడానికి ఎంచుకున్నారని సిద్దూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో తనను తాను అనుసంధానించుకున్నారని.. ఎన్నికైన ప్రభుత్వంగా, మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అందువల్ల ఈ అభ్యంతరాలను క్యాబినెట్ ఆమోదించిన ప్రసంగంలో చేర్చినట్లు సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కొత్త చట్టాన్ని రద్దు చేయడం తమ స్పష్టమైన లక్ష్యమని.. తమ పార్టీ, ప్రభుత్వం దృఢమైన నిర్ణయం తీసుకున్నాయని గుర్తు చేశారు. ఇది సాధించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. గతంలో నిరంతర నిరసనల వల్లే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవలసి వచ్చిందని గుర్తు చేశారు.

Also Read : మా జీవితాలు నాశనం.. బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!

మంత్రివర్గం తయారుచేసిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించడం ద్వారా గవర్నర్ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని.. శాసనసభను అవమానించారని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తన గవర్నర్ కార్యాలయ గౌరవాన్ని దెబ్బతీస్తుందని.. తమ పార్టీ, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా దీనిపై నిరసన తెలియజేస్తామన్నారు. ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగం కాపీలను అందరు శాసనసభ్యులకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు సిద్ధరామయ్య.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మద్దతు తెలిపారు. మొదట తమిళనాడు, తరువాత కేరళ. ఇప్పుడు కర్ణాటక… నమూనా స్పష్టంగా, ఉద్దేశపూర్వకంగా ఉందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తయారుచేసిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించిన గవర్నర్లు పార్టీ ఏజెంట్ల మాదిరి ప్రవర్తిస్తూ, సక్రమంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఉన్న ఏకైక పరిష్కారం అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించే పద్ధతిని ముగించాలని తాను గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. భారతదేశం అంతటా భావసారూప్యత కలిగిన ప్రతిపక్షాలను సంప్రదించి, ఈ అసంబద్ధమైన పద్ధతిని రద్దు చేయడానికి తదుపరి పార్లమెంటరీ సమావేశంలోనే రాజ్యాంగ సవరణను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్టాలిన్ సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్