Wednesday, February 4, 2026 11:09 AM
Wednesday, February 4, 2026 11:09 AM

జట్టులోనే పనికిరాని వాడ్ని కెప్టెన్ చేస్తారా..?

భారత టి20 జట్టులో లో మార్పులు జరగాల్సిన అవసరం ఉందా..? కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను పక్కన పెట్టాల్సిందేనా..? కెప్టెన్ పదవి ఇచ్చి అతని జట్టులో కాపాడుతున్నారా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినపడుతోంది. సాధారణంగా భారత్ లాంటి అగ్ర జట్లు కెప్టెన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాయి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే జట్టు ప్రయోజనాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. కానీ సూర్య కుమార్ యాదవ్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. అతను కెప్టెన్ అయిన తర్వాత నుంచి యావరేజ్ చూస్తే 24 గా ఉంది.

Also Read : బాలకృష్ణ పై ఎందుకీ ఏడుపు…? ఒక్కటైన మెగా ఫ్యాన్స్, వైసీపీ..?

కానీ అతన్ని కెప్టెన్ గా కొనసాగిస్తూ.. వెనక ఉండి కాపాడుతున్నారు అనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినపడుతున్నాయి. గత 20 మ్యాచ్లలో అతను చేసిన పరుగులు కేవలం 227 మాత్రమే. కానీ అతన్ని కెప్టెన్ గా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక అతని బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా ఓ క్లారిటీ లేదు. తనకు నచ్చిన స్థానంలో బ్యాటింగ్ కు రావడం, జట్టులోని కీలక ఆటగాళ్లను విస్మరించడం వంటివి విమర్శలకు దారితీస్తున్నాయి. సంజు శాంసన్ విషయంలో అతని వైఖరి పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అభిషేక్ శర్మతో కలిసి సంజు అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు. కానీ అతన్ని పక్కనపెట్టి గిల్ ను ఓపెనర్ గా ప్రమోట్ చేశారు.

Also Read : లోకేష్ కమిట్మెంట్ కు షాక్ అయిన టీడీపీ నేతలు

సంజు ప్రస్తుతం వాటర్ బాయ్ గా మారిపోయాడు. తిలక్ వర్మ మూడో స్థానంలో సక్సెస్ అయితే అతన్ని కాదని.. సూర్య కుమార్ యాదవ్ ఆస్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇక సౌత్ ఆఫ్రికా జరిగిన రెండో మ్యాచ్ లో.. అక్షర పటేల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. జితేష్ శర్మను ఆలస్యంగా బ్యాటింగ్ కు పంపించాడు. అసలు ఆటగాడిగా కూడా పనికిరాని సూర్యకుమార్ యాదవ్ ను.. కెప్టెన్ గా కొనసాగించి టి20 ప్రపంచ కప్ కు ఎలా వెళతారు అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. కెప్టెన్ సొంత నిర్ణయాలు తీసుకోకుండా కోచ్ ఏం చెప్తే అది చేయడం ఏంటనేది క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. అసలు యశశ్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లను పక్కన పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు అభిమానులు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్