Wednesday, March 25, 2026 01:41 PM
Wednesday, March 25, 2026 01:41 PM

సుప్రీం తీర్పు.. వారికి కూడా వర్తిస్తుందా..?

సుప్రీం కోర్టు తీర్పు వారికి కూడా వర్తిస్తుందా.. లేదా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. మతం మారిన వారు తమ ఎస్సీ కులాల హోదా కోల్పోతారని సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ తీర్పు కీలక నాయకుల రాజకీయ భవిష్యత్తుపై పెను ప్రభావం చూపిస్తుందా.. అనే చర్చ జోరుగా జరుగుతోంది. వీరిలో ఇద్దరు నేతలు టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న హోమ్ మంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి కేఎస్ జవహర్. ప్రస్తుతం ఈ ఇద్దరు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కూడా కీలక పదవుల్లో ఉన్నారు. హోమ్ మంత్రిగా అనిత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జవహర్ ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Also Read : మర్యాదగా ఉండు.. కోపం వద్దు.. గంభీర్ కు గంగూలీ సలహా..!

ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే.. ఈ ఇద్దరు ఉపాధ్యాయులే. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి ఎదిగారు. 2014 చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన ఎక్సైజ్ శాఖ మంత్రిగా జవహర్ పని చేశారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పదవుల గురించే జోరుగా చర్చ నడుస్తోంది. దళిత రిజర్వేషన్లు నిజమైన దళితులకు దక్కాలి.. మతం మారిన వారికి తహశీల్దార్ ఇచ్చిన సర్టిఫికేట్ ఉన్నప్పటికీ.. వారు ఎస్సీలుగా అనర్హులు అని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అంటే.. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్లకు అర్హులని.. క్రైస్తవ మతంలోకి మారిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు, అట్రాసిటీ చట్టం వంటివి ఆగిపోతాయని స్పష్టం చేసింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావు లేదని.. మతం మారిన వారికి అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉండదని కోర్టు స్పష్టం చేసింది.

ఇప్పుడు ఈ తీర్పు ఏపీలో చాలా మంది రాజకీయ భవిష్యత్తుకు బ్రేకులు వేసేలా ఉంది. ప్రస్తుత హోం మంత్రి అనిత పాత వీడియోలు ఈ తీర్పు వెలువడిన తర్వాత బాగా ట్రోల్ అవుతున్నాయి. 2014లోనే అనితను ఎస్సీ కోటాలో టీటీడీ బోర్డు మెంబర్‌గా చంద్రబాబు నియమించారు. ఆ సమయంలో అనిత ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో బాగా వైరల్ అయ్యింది. తన దగ్గర ఎప్పుడూ బైబిల్ ఉంటుందని.. తాను క్రిస్టియన్ అంటూ అనిత తెలిపారు. దీంతో ఓ క్రిస్టియన్‌కు ‌తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యత్వం ఎలా ఇస్తారనే ప్రచారం అప్పట్లో బాగా వచ్చింది. దీంతో అనితను ఆ పదవి నుంచి తప్పించారు. దీనిపై అప్పట్లో అనిత కన్నీరు కూడా పెట్టుకున్నారు.

Also Read : డబుల్ చిన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

అదే విధంగా ప్రస్తుత ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కేఎస్ జవహర్ కూడా క్రిస్టియన్ అని ప్రచారం వుంది. ఆయన పూర్తి పేరు సామ్యూల్ జవహర్ అని టీడీపీ నేతలే చెబుతున్నారు. ప్రస్తుత ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ మహిళా చైర్మన్ కూడా పక్కా క్రిస్టియన్ అని.. ఆమె పేరులోనే క్రిస్టియన్ అని ఉంది. వైసీపీకి చెందిన క్యాతేరా హెన్రీ క్రిస్టినా ప్రస్తుతం గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. వీరే కాదు.. ప్రస్తుత మండలి ఛైర్మన్‌గా కొనసాగుతున్న వైసీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కూడా క్రిస్టియన్ కావడం విశేషం. ఆయన 2009లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కొవ్వూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవల ఆయన కుమారుడి పెళ్లి మాత్రం క్రిస్టియన్ సాంప్రదాయంలోనే జరిగింది. ఈ వేడుకకు అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఇలా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చాలా మంది దళిత క్రిస్టియన్లు ఉన్నారనే చర్చ జోరుగా జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్; ఏపీలో మున్సిపల్...

ఏపీలో స్థానిక సంస్థల సమరానికి మున్సిపల్...

కిమిడి సోదరుల మధ్య...

తెలుగు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న...

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

పోల్స్