Sunday, October 19, 2025 11:02 PM
Sunday, October 19, 2025 11:02 PM
roots

బ్రేకింగ్: డాగ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. సుప్రీం సంచలన తీర్పు..!

దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కలు ఉండకూడదు అని తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్ట్.. తాను ఇచ్చిన తీర్పును సవరించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పు వెలువడిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా డాగ్ లవర్స్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. వీధి కుక్కలను షెల్టర్ లకు తరలించడం సాధ్యం కాదని, వాటిని చంపడమే అంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీనిపై మళ్ళీ సుప్రీం కోర్ట్ గడప తొక్కి తమ వాదనలు వినిపించగా, నేడు సుప్రీం తన తీర్పు వెల్లడించింది.

Also Read : బిగ్ బాస్ లోకి మెగా ఫ్యామిలీ హీరో ఎంట్రీ

వీధి కుక్కలను తీసుకెళ్లడంపై గతంలో ఉన్న కోర్టు ఆదేశాలే కొనసాగుతాయని చెప్పిన సుప్రీం కోర్టు.. దూకుడుగా ప్రవర్తించే లేదా రేబిస్ ఉన్న కుక్కలకు టీకాలు వేయాలని పేర్కొంటూ ఇప్పుడు ఆ ఉత్తర్వులో మార్పులు చేసింది. స్టెరిలైజేషన్ తర్వాత వీధి కుక్కలను షెల్టర్ల నుండి విడిచిపెట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీధి కుక్కలకు టీకాలు వేయించి, వాటిని తీసుకెళ్లిన ప్రాంతంలోనే వదిలేయాలని పేర్కొంది. దూకుడుగా ఉండే కుక్కలు, రేబిస్ ఉన్న కుక్కలను వదలకూడదని తెలిపింది.

Also Read : విశ్వంభర గ్లింప్స్ పై మీ అభిప్రాయం?

రోడ్లపై వీధి కుక్కలకు ఆహారం పెట్టకూడదని ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టడానికి ప్రత్యేక స్థలం ఉండాలి. వీధుల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నట్లు గుర్తిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. వాటికి ఆహారం అందించే ప్రాంతాల్లో నోటీసు బోర్డులు ఉండాలి. మున్సిపల్ వార్డులో జనాభా, వీధి కుక్కల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీలు ఆహార కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వీధి కుక్కలను పట్టుకునే వారిని అడ్డుకుంటే వారికి రూ.25 వేల నుండి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్