Monday, March 23, 2026 12:42 AM
Monday, March 23, 2026 12:42 AM

అవినీతి అధికారులకు సుప్రీం బిగ్ షాక్.. లంచం కేసులో దొరికితే అంతే..!

దేశంలో ప్రభుత్వాధికారుల అవినీతి పెరిగిపోతున్న తరుణంలో సుప్రీం కోర్ట్ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీం కోర్ట్. అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రభుత్వ అధికారిని నిర్దోషిగా విడుదల చేసే వరకు తిరిగి సర్వీసులో చేరడానికి అనుమతించరాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. అవినీతిపరులైన అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి అనుమతించడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి వరలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

Also Read : నమ్రతా శిరోద్కర్

లంచం కేసులో దోషిగా తేలిన రైల్వే ఇన్‌స్పెక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. “అవినీతిపరుడైన ప్రభుత్వ అధికారిని తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఎందుకు అనుమతించాలి?” అని ధర్మాసనం ప్రశ్నించింది. “ఒక దోషిగా తేలిన అధికారిని సర్వీసులో కొనసాగడానికి అనుమతిస్తే, అది వ్యవస్థ పునాదిని బలహీనపరుస్తుంది. ఇది నిజాయితీపరులైన అధికారులకు అవమానం అవుతుంది” అని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ తన పిటిషన్‌లో, లంచం కేసులో గుజరాత్‌లోని ట్రయల్ కోర్టు తన దోషిగా ప్రకటించడాన్ని అడ్డుకోవాలని సుప్రీం కోర్ట్ కు వెళ్ళాడు.

Also Read : యోగాంధ్ర.. ఏపీ బ్రాండ్.. రికార్డుల మోత..!

గుజరాత్ హైకోర్టు శిక్షను సస్పెండ్ చేసి ఇన్‌స్పెక్టర్‌ కు బెయిల్ మంజూరు చేసింది. కాని అతను నిర్దోషిగా ప్రకటించాలని కోరగా అందుకు నిరాకరించింది. పిటిషనర్ తరపున హాజరైన న్యాయవాది నితిన్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, ఇన్‌స్పెక్టర్‌ ను దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించి ట్రయల్ కోర్టు తప్పు చేసిందని వాదించారు. ఇన్‌స్పెక్టర్ లంచం డిమాండ్ చేశాడని, తీసుకున్నాడని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని సిన్హాల్ అన్నారు. అందువల్ల, శిక్షను నిలిపివేసి, తన క్లయింట్ తన ఉద్యోగాన్ని తిరిగి చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్ట్.. కె.సి. సరీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును ఉటంకిస్తూ ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ పెండింగ్‌లో ఉందనే కారణంతో దోషిగా తేలిన అధికారిని సర్వీసులో కొనసాగించడానికి అనుమతించకూడదని చెప్తూ పిటీషన్ కొట్టేసింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్