Sunday, March 22, 2026 12:56 PM
Sunday, March 22, 2026 12:56 PM

వరుస వివాదాల్లో రాము.. ఇప్పుడు అవసరమా..?

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 250 మంది పైగా మృతి చెందారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న బోయింగ్ విమానం.. బయలుదేరిన 58 సెకన్ల లోపే కూలిపోయింది. ఎయిర్ పోర్ట్ పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో మరో 30 మంది మెడికోలు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. లండన్‌లో ఉన్న కుమార్తెను చూసేందుకు రూపాని వెళ్తున్నారని.. అయితే ఈ ప్రమాదంలో ఆయన కూడా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భాంత్రి వ్యక్తం చేశాయి. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోతైనా దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది.

Also Read : కొత్త మంత్రులకు స్థానిక నాయకత్వంతో వేధింపులు…?

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ ఏడాది పాలన వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన రామ్మోహన్.. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే.. హుటాహుటిన అహ్మదాబాద్ చేరుకున్నారు. ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాద ఘటన విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. కేంద్ర హోమ్ మంత్రితో కలిసి ప్రమాదంలో ధ్వంసమైన మెడికల్ కాలేజీ భవనాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూడా.

Also Read : విమాన ప్రమాదానికి కారణం అదేనా..?

అహ్మదాబాద్ విమాన ప్రమాదం పలు కుటుంబాల్లో ఘోర విషాదం నింపింది. అయితే ఈ ఘటన అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాద స్థలాన్ని పరామర్శించిన సమయంలో తీసిన వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు రాము. ఇదే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ఓ వైపు ఘోర ప్రమాదం జరిగితే.. రాము మాత్రం.. ఇలా వీడియోల ద్వారా ప్రచారం చేసుకోవటం ఏమిటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ వీడియోకు మ్యూజిక్ కూడా పెట్టడం అవసరమా అని విమర్శిస్తున్నారు. ప్రమాదానికి గురైన విమానంలో సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. గతేడాది రెండుసార్లు ఇదే విమానంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానంపై డీజీసీఏ కూడా ఎయిర్ ఇండియాకు గతంలో లేఖ రాసింది. ఇలాంటి విమానానికి ఎలా అనుమతులు ఇచ్చారని కూడా రామ్మోహన్‌ను పలువురు ప్రశ్నిస్తున్నారు.

Also Read : ఇరాన్ కు వణుకుతున్న ట్రంప్.. సైనికులు వెనక్కే

కేంద్ర మంత్రిగా రామ్మోహన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ప్రమాదాలపై సరైన చర్యలు తీసుకోలేదని కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. గతంలో భారీ వర్షానికి ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూఫ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ క్యాబ్ డ్రైవర్ మృతి చెందాడు. ఆ సమయంలో కూడా రామ్మోహన్ ఇలాగే వీడియో రిలీజ్ చేశారు. ఇక విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్‌లో వెళ్లిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. ట్రైయిల్ రన్ వేశారు తప్ప.. ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. దీనిపై కూడా ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప.. కేంద్ర మంత్రిగా రాము ఏం చేస్తున్నారనో వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్