Thursday, February 5, 2026 02:23 PM
Thursday, February 5, 2026 02:23 PM

మల్లన్న దగ్గర కూడా కల్తీ పాపాలేనా..?

2019 నుంచి 2024 వరకు ఏపీలో జరిగిన కార్యక్రమాలు బహుశా ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండవేమో. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటంతో అప్పట్లో ఆ పార్టీ నేతలు ఏది చేసినా సరే చెల్లింది అనే మాట వాస్తవం. అందుకే దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన ప్రభుత్వమే.. కల్తీ నెయ్యి సహా అనేక కార్యక్రమాలతో పరువు తీసింది అనే విమర్శలు వచ్చాయి. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో వైసీపీ చేసిన కార్యక్రమాలపై ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఇది అక్కడితో ఆగలేదు అనే విమర్శలు వచ్చాయి.

Also Read : వాళ్లను ఎందుకు అరెస్టు చేయలేదన్న జగన్..!

బెజవాడ కనక దుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న దగ్గర సహా అనేక దేవాలయాల్లో అవినీతి కార్యక్రమాలు జరిగాయి. కల్తీ నెయ్యితో ఈ క్షేత్రాలను అపవిత్రం చేసింది నాటి సర్కార్. తాజాగా శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా చేసారనే విషయాన్ని గుర్తించారు. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి సరఫరా అయినట్లు గుర్తించారు. 2022 మే నుంచి 2023 మార్చి వరకు నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్.. కల్తీ నేయ్యినే ఎక్కువగా సరఫరా చేసినట్టు అధికారులు గుర్తించారు.

Also Read : చంద్రబాబు సలహదారుగా మళ్లీ ఆయనే..!

విజయ డెయిరీని కాదని రాజేష్ కార్పొరేషన్‌ కు కాంట్రాక్ట్ ఇవ్వగా.. కిలో రూ.489 చొప్పున కాంట్రాక్ట్ దక్కించుకుంది రాజేష్ కార్పొరేషన్. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంతోనే శ్రీశైలంలో కల్తీ నెయ్యి వ్యవహారాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో అక్కడి స్థానిక ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. రాజేష్ కార్పొరేషన్‌కు సొంత డెయిరీ లేదని సిట్ అధికారులు తేల్చారు. ఇక రాజేష్ కార్పొరేషన్‌కు సరఫరా చేసింది.. తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీనే అని, వైసీపీ హయాంలో 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలుకు రూ.15.89 కోట్ల చెల్లింపులు చేసినట్టు గుర్తించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

యాటిట్యూడ్ స్టార్‌.. “గుంజి...

సినిమా అంటే.. నలుగురు చూసేది.. అందులో...

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

పోల్స్