మూవీ ఆడియన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప 2. పార్ట్ 1 కు మించి ఈ సినిమాపై భారీ హైప్ ఉంది. బాహుబలి సినిమాను మించి ఉంది అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని పోస్టర్స్ అలాగే సాంగ్స్ సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచాయి. సినిమా విషయంలో బన్నీ చాలా కష్టపడ్డాడు అనే విషయం పార్ట్ 1 కంటే… పుష్ప 2 పోస్టర్స్ క్లియర్ గా చెప్పాయి. త్వరలోనే టీజర్ ను, ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది పుష్ప టీం. మేకర్స్ ప్రమోషన్స్ పై భారీ ప్లాన్ తో రెడీ అవుతున్నారు.
Also Read : సఫారీ గడ్డపై మొనగాళ్ళు… రికార్డుల తుక్కు రేగ్గోట్టారు
రిలీజ్ కు సరిగా 20 రోజులు ఉండటంతో ఇక్కడి నుంచి ప్రమోషన్స్ కీలకం కానున్నాయి. ఓ ఐటెం సాంగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్న డైరెక్టర్ సుకుమార్… త్వరలోనే సినిమా విషయంలో క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇండియా వైడ్ గా మొత్తం ఏడు ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అందులో హైదరాబాద్ లో నిర్వహించే ఈవెంట్ పైనే అందరి ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్న ఈవెంట్ కు పొలిటికల్ స్టార్స్ ను కూడా పిలవాలి అని నిర్మాతలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Also Read : నయనతార, ధనుష్ గొడవేంటి…? ధనుష్ కోపం చల్లారలేదా…?
సిఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ సహా మరికొందరిని ఈ ఈవెంట్ కు ఆహ్వానించే చేసే ఆలోచనలో ఉన్నట్టుగా టాక్. అన్ స్టాపబుల్ షో ద్వారా మెగా ఫ్యామిలీతో గ్యాప్ తగ్గించే ప్లాన్ చేసాడు బన్నీ. అందుకే చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ ను ఈ ఈవెంట్ కు పిలిస్తే మంచిది అని భావిస్తున్నాడు. వీరితో పాటుగా నందమూరి బాలకృష్ణను కూడా ఇన్వైట్ చేసే ఆలోచనలో ఉన్నారు పుష్ప మేకర్స్. అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్యకు బన్నీ దగ్గరయ్యాడు. దీనితో ఈవెంట్ కు బాలయ్యను ఆహ్వానిస్తే బాగుంటుంది అని భావిస్తున్నట్టుగా టాక్. మొత్తం మీద గెస్ట్స్ పై గందరగోళం తొలగితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అంచనాలు భారీగా పెరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

