Wednesday, March 25, 2026 12:06 AM
Wednesday, March 25, 2026 12:06 AM

బ్రేకప్ నుంచి WPL టైటిల్ వరకు.. స్ఫూర్తి నింపిన స్మృతి

ఇటీవల స్మృతి మందాన జీవితంలో చోటుచేసుకున్న వ్యక్తిగత సంఘటనలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి. వివాహానికి కొద్దిసేపు ముందు ప్రేమించిన వ్యక్తి నిజ స్వరూపం బయటపడటంతో ఆమె ఒక్కసారిగా ప్రేమించిన వ్యక్తితో జీవితం గడపాలి అనుకున్న ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆ పరిణామం ఆమె కుటుంబాన్ని కూడా దెబ్బతీసింది. అయినప్పటికీ, స్మృతి ఈ కష్టాలను తన కెరీర్‌పై ప్రతికూలంగా ప్రభావితం కాకుండా చూసుకుంది. గతాన్ని ఒక పీడకలగా భావిస్తూ, పూర్తిగా తన ఆటపై దృష్టి సారించడం ద్వారా అసాధారణమైన మానసిక ధైర్యాన్ని ప్రదర్శించింది.

Also Read : కల్తీ నెయ్యి పై ‘సిట్’ లో జగన్ మనిషి

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆమె ప్రదర్శన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో 377 పరుగులు చేసి 53.85 సగటుతో నిలిచింది. మూడు అర్థ శతకాలు నమోదు చేసిన స్మృతి, లీగ్ దశలో ఢిల్లీ జట్టుపై 96 మరియు 38 పరుగులు చేయగా, ఫైనల్‌లో 87 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో స్థిరత్వం, ఒత్తిడిలోనూ ప్రశాంతత ఆమె ప్రత్యేకతగా నిలిచాయి. ఎంతటి ఒత్తిడిలోనూ అధైర్య పడకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ జట్టు విజయంలో పాలుపంచుకున్నారు.

స్మృతి గతంలో జీవించే ఆటగాళ్లలో ఒకరు కాదు. వాస్తవాన్ని అంగీకరిస్తూ, భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతుంది. అదే దృక్పథంతో 2026 సీజన్‌లో బెంగళూరు జట్టును మరోసారి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిపింది. 2024లో ట్రోఫీ అందించిన ఆమె, ఇప్పుడు రెండోసారి అదే ఘనతను పునరావృతం చేసింది. ఈ సీజన్‌లో బెంగళూరు జట్టు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు నమోదు చేయడం ఆమె నాయకత్వ పటిమకు నిదర్శనం.

Also Read : నమ్మకం లేదు.. కానీ అదే నిజం.. ఇదే లాజిక్కు..!

బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించడమే కాకుండా, పరిమిత బౌలింగ్ వనరులతోనూ మంచి ప్రభావం చూపింది. విజయం అనంతరం ఆమె ఎలాంటి భావోద్వేగ ప్రదర్శనకు లోనుకాలేదు. అది ఆమె ఆత్మవిశ్వాసానికి, ప్రొఫెషనల్ దృక్పథానికి ప్రతీకగా నిలిచింది. మాటలకన్నా ఆటతోనే సమాధానం చెప్పాలనే స్మృతి మందాన వైఖరి, ఈ విజయంతో మరోసారి స్పష్టమైంది. ఈ విజయానికి ఆమె మరియు జట్టు పూర్తిగా అర్హులే. ఆమె విజయం మరెంతో మంది మహిళలకు స్ఫూర్తి నింపాలని ఆశిద్దాం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: డేంజర్ జోన్...

ఏపీలోని బెజవాడ నగరం వేదికగా సాగుతున్న...

బ్రేకింగ్: మాట నిలబెట్టుకున్న...

గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న.....

ఏపీపై రైల్వే శాఖ...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి...

బాబోయ్.. బెజవాడలో ఉగ్రవాదులు..!

విజయవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విజయవాడలో...

బ్రేకింగ్: ఐటీ రంగంపై...

అమెరికా, ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం...

దానంపైనే బీఆర్ఎస్ గురి..?...

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.....

పోల్స్