సాధారణంగా ఆసియా ఆటగాళ్లకు ఆస్ట్రేలియాలో రాణించడం అంటే కాస్త కష్టమే. ముఖ్యంగా భారత్ వంటి ఉపఖండ పిచ్ లపై ఆడి ఆస్ట్రేలియాలో ఆడటం ఓ సవాల్. గతంలో దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియాలో ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కొందరు ఆటగాళ్లు మాత్రమే ఆస్ట్రేలియాలో సక్సెస్ అయ్యారు. వీరిలో విరాట్ కోహ్లీ డామినేషన్ ఆస్ట్రేలియా పై ఓ స్థాయిలో నడిచింది. వైట్ బాల్ క్రికెట్ లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో వారి గడ్డపై డామినేట్ చేశాడు.
Also Read : అజారుద్దీన్ శాఖ అదేనా..? కానీ మరో అడ్డంకి కూడా..?
కానీ ప్రస్తుతం టీమిండియా యువ కెప్టెన్ గిల్ మాత్రం ఆస్ట్రేలియాలో వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. 2021లో గబ్బా వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో చేసిన 91 పరుగులు మినహా.. ఆ తర్వాత గిల్ ఆస్ట్రేలియాలో సక్సెస్ అవ్వలేదు. గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్ లో గిల్ దారుణంగా విఫలమయ్యాడు. భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఈ స్టార్ ఆటగాడు రెడ్ బాల్ క్రికెట్ లో విఫలం కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కీలకమైన మూడవ స్థానంలో అతన్నీ ఆడించారు.
Also Read : స్పిరిట్ కోసం ప్రభాస్ కొత్త లుక్.. వేరే లెవెల్ ప్లాన్..!
ఈ ప్రస్తుతం జరుగుతున్న వన్డే, టి20 సిరీసుల్లో కూడా ఇలాగే ఫెయిల్ అయ్యాడు ఈ పంజాబీ ఆటగాడు. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సమయంలో ఫుల్ ఫామ్ లో ఉన్న అతను.. తీరా చూస్తే 3 వన్డే మ్యాచుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి టీ20లో పిచ్ కాస్త బ్యాటింగ్ కు అనుకూలించడంతో.. పరుగులు చేసే ప్రయత్నం చేశాడు. ఇక రెండవ టి20లో ఘోరంగా విఫలం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అప్పుడే కెప్టెన్సీ కోసం గిల్ ఎదురు చూడటం కరెక్ట్ కాదని.. రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు కూడా ఆస్ట్రేలియా మైదానాల్లో నిరూపించుకున్న తర్వాతనే కెప్టెన్సీకి ప్రయత్నం చేశారని, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకున్న తర్వాతనే కెప్టెన్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

