ఫోన్ ట్యాపింగ్” రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాన్ని కుదిపేస్తున్న అంశం ఇది. 2019 ఎన్నికల తర్వాత దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తెలంగాణా ప్రభుత్వంపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసాయి అప్పట్లో ప్రతిపక్షాలు. ఇక తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై విచారణ వేగవంతం అయింది. అయితే ప్రభాకర్ రావు అనే అధికారి అమెరికా పారిపోవడంతో విచారణ ముందుకు సాగలేదు.
Also Read : మహిళపై దాడి.. డైరెక్ట్ గా ఎస్పీకి చంద్రబాబు ఫోన్
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది ఇప్పుడు. విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖుల ఫోన్ లతో పాటుగా జర్నలిస్ట్ ల ఫోన్ లు కూడా ట్యాప్ చేసారని గుర్తించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసారని గుర్తించారు. భారత రాష్ట్ర సమితి.. ప్రత్యర్థి పార్టీలతో పాటు ఏపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు.
Also Read : మహిళలకు కూటమి మరో అదిరిపోయే న్యూస్
తెలంగాణ, ఏపీలో 1000 మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలో 650 మంది కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు విచారణలో వెల్లడి అయింది. 2018 నుంచి 2023 వరకు ఫోన్లు ట్యాప్ చేసినట్లు గుర్తించారు. ఏపీలో టీడీపీ, జనసేన కీలక నేతల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు విచారణలో గుర్తించారు. తెలంగాణాలో కవిత, ఏపీలో షర్మిల సహా జర్నలిస్ట్ ల ఫోన్ లను కూడా ట్యాప్ చేసారట. టీడీపీ, కాంగ్రెస్ అనుకూల పత్రికల్లో పని చేసే ప్రముఖ జర్నలిస్ట్ ల ఫోన్ లను ట్యాప్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి సమీపంలో ఉండే ఒక ప్రముఖ నేత ఇంట్లో ఈ వ్యవహారం జరిగినట్టు తేల్చారు.
Also Read : అక్క ఫోన్ ట్యాప్ చేయించిన అన్న.. షర్మిల వద్ద సంచలన ఆధారాలు
అక్కడికి ప్రముఖ పోలీసు అధికారులు నిత్యం వచ్చి వెళ్తూ ఉండేవారు అని, వారికి ముగ్గురు కీలక నేతల ఆదేశాలు ఉండేవి అని గుర్తించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేత కూడా అక్కడికి పదే పదే వచ్చి వెళ్ళేవారు అని, ఆంధ్రప్రదేశ్ లో తమకు కావాల్సిన పనిని సదరు నేతతో చేయించుకునేవారు అని సమాచారం. వైసీపీలో జగన్ కు వ్యతిరేకంగా పని చేసిన నాయకులు, పార్టీ మారాలి అనుకుంటున్న వారి ఫోన్ లను సైతం ట్యాపింగ్ చేసినట్టు తేల్చారు. 2023 ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ పార్టీకి పని చేస్తున్న సునీల్ కనుగోలు టీం ఫోన్లు సైతం ట్యాపింగ్ జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఏపీకి చెందిన సిఎం రమేష్, టీడీ జనార్ధన్, వై సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు, వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి, వైఎస్ విజయమ్మ, కాంగ్రెస్ కు చెందిన తులసి రెడ్డి ఫోన్లను సైతం ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ విచారణలో కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ నేతలు రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లే అనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

