Sunday, March 22, 2026 08:53 AM
Sunday, March 22, 2026 08:53 AM

మాస్క్ ఇవ్వలేని వాడు మెడికల్ కాలేజీ కడతాడా..? విశాఖలో షాకింగ్ హోర్డింగ్

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో.. మహమ్మారి కరోనా విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపణలు అప్పట్లో తీవ్ర స్థాయిలో వచ్చాయి. దీనికి సంబంధించిన నర్సీపట్నంలో డాక్టర్ గా పనిచేసిన దళిత వైద్యుడు సుధాకర్ ఓ వీడియోలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత అతనిని టార్గెట్ చేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేశారు అప్పటి అధికారులు. అతను మరణించే వరకు కూడా ఏదో ఒక రూపంలో వేధించారు. పిచ్చివాడిగా ముద్ర వేయడమే కాకుండా రోడ్డు పై అతని చేతులు వెనక్కు కట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Also Read : విద్యార్థుల మనసు గెలిచిన లోకేష్.. మరో సంచలన నిర్ణయం

అతను గుండెపోటుతో మరణించే వరకు వైసిపి సోషల్ మీడియా కూడా అతనిని టార్గెట్ చేసింది. కానీ దళిత సంఘాలు గాని దళిత నాయకులు గానీ ఎవరు ముందుకు వచ్చి అది తప్పు అని మాట్లాడిన పరిస్థితి లేదు. ఈ వ్యవహారాన్ని ఏపీ హైకోర్టు సిబిఐ కి కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సెగ తగులుతోంది. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని సందర్శించేందుకు వెళుతున్న జగన్.. సుధాకర్ విషయంలో సమాధానం చెప్పాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : మిథున్ రెడ్డి లిక్కర్ కేసు మూలనపడినట్లేనా..?

ఈ సందర్భంగా జగన్ ప్రయాణించే మార్గంలో ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. మాస్క్ అడిగితే ఇవ్వలేని వారు మెడికల్ కాలేజీ ఎలా కడతారంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. దళిత డాక్టర్ మరణానికి సమాధానం చెప్పి జగన్ నర్సీపట్నంలో అడుగు పెట్టాలని.. జగన్ పర్యటనను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. మాస్క్ అడిగితే ఇవ్వలేక హత్యలు చేసేవాళ్లు మెడికల్ కాలేజీలు కట్టడమా సిగ్గుచేటు.. తస్మాత్ జాగ్రత్త అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ పర్యటనకు వెళ్లే దళితులు ఆలోచించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్