Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

ఆస్ట్రేలియాకు మొగుడులా తయారైన బౌలర్

ప్రపంచ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న ఆస్ట్రేలియా జట్టు ఓ యువ బౌలర్ దెబ్బకు మాత్రం అల్లాడిపోతుంది. ప్రపంచ స్టార్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్.. ఆ బౌలర్ పేరు వింటే చాలు వణికిపోతోంది. ఆ బౌలర్ ఎవరో కాదు.. షమార్ జోసెఫ్. వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఇప్పుడు బౌలింగ్ లో పెద్ద దిక్కు అయ్యాడు ఈ బౌలర్. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడంలో కీలక పాత్ర పోషించిన జోసెఫ్.. ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనకు వెళ్ళిన ఆసిస్ కు చుక్కలు చూపిస్తున్నాడు.

Also Read : ఆ విషయంలో జగన్ భయపడుతున్నారా..?

విండీస్ ను తక్కువ అంచనా వేసి బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బలు కొడుతున్నాడు. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసాడు జోఫెస్. అందులో మూడు టాప్ ఆర్డర్ వికెట్ కాగా మరొకటి మిడిల్ ఆర్డర్ వికెట్. ఓపెనర్లు ఇద్దరినీ, వన్ డౌన్ లో వచ్చిన కామెరూన్ గ్రీన్ ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే దూకుడు చూపించాడు. ఓపెనర్ వికెట్ తీసి.. ఆదిలోనే దెబ్బ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో పది పరుగులు వెనుకబడిన ఆస్ట్రేలియాను విండీస్ బౌలింగ్ లైనప్ ఎక్కడా కోలుకోనీయలేదు.

Also Read : బ్లాక్ బాక్స్ డేటా డౌన్లోడ్.. ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం

92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. పిచ్ పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉండటంతో విండీస్ బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేస్తున్నారు. షమార్ జోసెఫ్ లైన్ అండ్ లెంత్ తో బౌలింగ్ చేయడం, పిచ్ బౌన్స్ కావడంతో ఆసిస్ ఆటగాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను 150 పరుగుల లోపు కట్టడి చేస్తే.. ఖచ్చితంగా విండీస్ విజయం సాధించడం పెద్ద విషయం కాదు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో హెడ్, వెబ్ స్టర్ క్రీజ్ లో ఉన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్