Sunday, March 22, 2026 01:30 AM
Sunday, March 22, 2026 01:30 AM

గిల్ కు మరో షాక్ ఇవ్వనున్న సెలెక్టర్ లు..!

ఈ మధ్యకాలంలో భారత క్రికెట్ టీం సెలక్షన్ పై గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. గంభీర్ వచ్చిన తర్వాత జరుగుతున్న మార్పులతో.. టీమిండియా సెలక్షన్ పై ఫాన్స్ లో ఎప్పుడూ లేని ఇంట్రెస్ట్ కనబడుతోంది. ఎవరిని తప్పిస్తారో ఎవరిని తీసుకొస్తారో అర్థం కాక.. మాజీ క్రికెటర్లు సైతం తల పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఎన్నో ప్రయోగాలు చేసిన గంభీర్ ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోయాడు. టెస్ట్ జట్టు, టి20 జట్టు, వన్డే జట్లు వేరువేరుగా ఉండాలంటూ చెప్పుకొచ్చిన గంభీర్.. తనకు నచ్చిన ఆటగాళ్లను మాత్రం మూడు ఫార్మేట్ లలో ఆడిస్తూ.. ఆశ్చర్యం కలిగిస్తున్నాడు.

Also Read : బెజవాడ పోలీసుల సంచలన నిర్ణయం..!

ఇక ఇప్పుడు టీమిండియా.. న్యూజిలాండ్ తో ఆడబోయే వన్డే సిరీస్ విషయంలో.. గంభీర్ ప్లాన్ ఏంటో ఎవరికి అర్థం కావటం లేదు. టి20 వరల్డ్ కప్ నుంచి శుభమన్ గిల్ ను తప్పించిన సెలెక్టర్లు.. ఇప్పుడు గంభీర్ సపోర్ట్ చేస్తున్న మరో ఆటగాడికి కూడా షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. హర్షిత్ రానాను వన్డే సీరిస్ నుంచి పక్కన పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక గిల్ ను వన్డే సిరీస్ కు కూడా పక్కన పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్ విషయంలో ఇప్పటివరకు సానుకూలంగా ఉన్న బోర్డు.. అభిమానుల నుంచి వ్యతిరేకతో వస్తున్న నేపథ్యంలో కొంత కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.

Also Read : రెచ్చిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ.. మరీ ఇంత బరితెగింపా..!

వన్డే సిరీస్ కు ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అతన్ని ఇప్పటికే టి20 జట్టులోకి కూడా తీసుకొచ్చింది సెలక్షన్ కమిటీ. వైట్ బాల్ క్రికెట్ కు సరిగా సరిపోయే.. ఈ జార్ఖండ్ ఆటగాడు ఇటీవల దేశవాళి క్రికెట్లో అంచనాలకు మించి రాణిస్తున్నాడు. అందుకే అతని విషయంలో కొంత బోర్డు కూడా సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో ఆడబోయే 3 వన్డేల సీరిస్ కు కీపర్ గా అతనికి అవకాశం ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అయితే రిషబ్ పంత్ విషయంలో ఎలా వ్యవహరిస్తారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. కొన్నాళ్లుగా ఫెయిలవుతున్న పంత్.. వైట్ బాల్ క్రికెట్ లో అవకాశాలు తెచ్చుకోలేకపోతున్నాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్