Sunday, March 22, 2026 11:33 AM
Sunday, March 22, 2026 11:33 AM

గిల్ కు మరో షాక్..? సెలెక్టర్ లు సంచలనం..!

భారత క్రికెట్ లో ఆధిపత్యం చలాయించడానికి రంగం సిద్దం చేసుకున్న యువ క్రికెటర్ శుభమన్ గిల్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలి కాలంలో ఫాం లేక, సరైన టెక్నిక్ లేక సతమతవుతోన్న గిల్.. ఇటీవల వరుసగా వైట్ బాల్ క్రికెట్ లో ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికాతో టి20 సీరీస్ లో ఆట తీరు కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీనితో అతనిని టి20 వరల్డ్ కప్ కు, న్యూజిలాండ్ తో సీరీస్ కు పక్కన పెట్టారు.

Also Read : భారత రాష్ట్ర సమితి పేరు మారుతోంది..?

గత టి20 వరల్డ్ కప్ లో కూడా అతనికి చోటు దక్కలేదు. ఇక ఇప్పుడు మరో షాక్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో సీరీస్ కు కెప్టెన్ గా కెఎల్ రాహుల్ ను కంటిన్యూ చేసే అవకాశం కనపడుతోంది. కెప్టెన్ గా రాహుల్.. ప్రోటీస్ ను కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. దీనితో కివీస్ తో సీరీస్ కు కూడా అతనికే ఛాన్స్ ఇవ్వనున్నారు. గాయం కారణంగా సీరీస్ కు శుభమన్ గిల్ దూరం అయ్యే ఛాన్స్ ఉన్నట్టు చెప్పినా.. తప్పించే ఉద్దేశమే అంటున్నాయి క్రికెట్ వర్గాలు.

Also Read : అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. జగన్ డబుల్ గేమ్..!

ఆస్ట్రేలియా పర్యటన నుంచి వన్డే కెప్టెన్ అయిన గిల్.. సౌత్ ఆఫ్రికాతో వన్డే సీరీస్ కు గాయం కారణంగా తప్పుకున్నాడు. శనివారమే వన్డే సీరీస్ కు జట్టును ప్రకటించాల్సి ఉన్న సెలెక్షన్ కమిటీ, గిల్ విషయంలో సందిగ్దత కారణంగానే ఎంపికను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. గిల్ విషయంలో జాతీయ మీడియా, సోషల్ మీడియా, మాజీ క్రికెటర్ లు తీవ్ర విమర్శలు చేసారు. ఇక గిల్ స్థానంలో అయ్యర్ కు చోటు కల్పించే అవకాశం కనపడుతోంది. మూడు ఫార్మాట్ లకు కెప్టెన్ కావాలని కలలు కన్న శుభమన్ గిల్.. కెరీర్ పై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్