యానిమల్.. రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం. అర్జున్ రెడ్డి సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఈ సినిమాను తీసిన విధానం చూసి విమర్శకులు కూడా ఫిదా అయిపోయారు. రణబీర్ సింగ్ ను చూపించిన విధానం, సినిమాలో పాటలు, డైలాగ్స్ అన్నీ కూడా ఓ సంచలనమే. ఇక అప్పటి నుంచి ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 13న జపాన్‌లో యానిమల్ విడుదల కానుంది.
Also Read : ప్రియాంక రిక్వస్ట్ తో మహేష్, రాజమౌళి షాక్ అయ్యారా..?
ఇది థియేటర్లలోకి అడుగుపెట్టడానికి ముందే భారీ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా స్పెషల్ షో వేయగా.. సందీప్ రెడ్డి వంగాతో పాటుగా అక్కడి ప్రేక్షకులు కూడా సినిమా చూసి ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు యానిమల్ పార్క్ గురించి చర్చ మొదలైంది. అక్కడి జర్నలిస్ట్ లు దీనిపై సందీప్ రెడ్డి వంగాను పలు ప్రశ్నలు వేసారు. తన ప్రస్తుత సినిమా పూర్తి చేసిన తర్వాత యానిమల్ పార్క్ త్వరలో ప్రారంభమవుతుందన్నాడు. ఫస్ట్ పార్ట్ కంటే ఇది భయంకరంగా ఉంటదన్నాడు.
Also Read :బాబాయ్ కోసం వెనక్కి తగ్గిన అబ్బాయ్..!
దీన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా ప్లాన్ చేస్తున్నామని, ఇది ఒకేలా కనిపించే ఇద్దరు సోదరుల మధ్య యుద్ధమని, కాబట్టి యానిమల్ పార్క్ సరైన టైటిల్ అనుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా షూటింగ్ 2027 మధ్యలో మొదలవుతుందని తెలిపాడు. ఈ సినిమాలో నటించేందుకు హీరో రణ్‌బీర్ కపూర్, ఆ పాత్రలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నాడని కామెంట్ చేసాడు. ఆ సినిమా పూర్తయ్యే వరకు తాను మరో సినిమా చేయలేను అంటూ రణబీర్ కపూర్ కూడా కామెంట్ చేసాడు.

