Friday, September 12, 2025 05:23 PM
Friday, September 12, 2025 05:23 PM
roots

సజ్జల.. సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూస..!

“పతివ్రత పరమాన్నం వండితే.. తెల్లార్లు చల్లారలేదంటా..”.. ఈ మాట వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. నాటు సామెత. ఇందులో చాలా అర్థం ఉంది. ఎవరైనా సరే తప్పు చేసి.. బుకాయిస్తే.. వారి గురించి మన పెద్దలు చెప్పే మాట ఇదే. ఇప్పుడు ఇదే మాట వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి సరిగ్గా సరిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏపీ ప్రజలకు కొత్తగా తెలియాల్సింది ఏమీ లేదు. ఎన్నికల ముందు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించారు వైసీపీ నేతలు. పదవిలోకి రాక ముందు మీరే నా దేవుళ్లు అంటూ ఓటర్ల కాళ్లు పట్టుకున్న వైసీపీ నేతలు.. పెత్తనం వచ్చిన తర్వాత మాత్రం.. నువ్వెడ్రా అంటూ బూతులతో రెచ్చిపోయారు. ఇక ప్రతిపక్ష నేతల గురించి అయితే రాయలేని బాష.. వ్యక్తిత్వ హననం.. ఇంట్లో ఆడవాళ్ల గురించి కూడా అత్యంత నీచంగా మాట్లాడిన చరిత్ర వైసీపీ నేతలదే. ఇది ఒక్క రోజుతో ఆగలేదు. ఐదేళ్ల పాటు ప్రతి రోజూ.. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. కార్యకర్త మొదలు.. మంత్రిస్థాయి నేత వరకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేశారు. ఇక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న ధర్మాన కృష్ణదాస్ అయితే.. లం.. కొడకా అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇక గౌరవమైన సభాపతి స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం అయితే.. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి అతి నీచంగా రాజకీయ లం.. త్వానికి పాల్పడ్డారంటూ నోరు పారేసుకుని.. స్పీకర్ పదవికే మాయని మచ్చగా మారిపోయారు.

Also Read : బలగాలకు పూర్తి స్వేచ్చ.. ప్రధాని కీలక ప్రకటన

ఇలాంటి వైసీపీ నేతల గురించి కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం వైసీపీ జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో సజ్జల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ భేటీలో ప్రభుత్వం చేస్తున్న అరెస్టులపై నేతలు ప్రస్తావించారు. ఇవన్నీ అక్రమ అరెస్టులంటూ వాపోయారు. వారి చేసిన పనులను బయటపెట్టకుండా… ప్రభుత్వం మాత్రం తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తున్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి సుద్దపూస కబుర్లు చెప్పారు. వైసీపీలో ఎవరూ బూతులు మాట్లాడరు.. అసభ్యకరమైన వ్యాఖ్యలు ఎవరూ చేయరు.. అసలు అలాంటి వారిని వైఎస్ఆర్‌సీపీ ఎలాంటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు.. అని సజ్జల కొత్తగా నీతి మాటలు చెబుతున్నారు. మరి అదే నిజమైతే.. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైన, కుటుంబంపైన నీచమైన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిని విచారించిన సమయంలో.. తనకు స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల అని.. లైవ్ ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది సాక్షి ప్రతినిధులు అని స్పష్టం చేశారు. సజ్జల అంటే.. వైసీపీలో ఒక్కరే.. ఆయనే ఎస్ఆర్‌‍కే… సజ్జల రామకృష్ణారెడ్డి.

Also Read : రాహుల్ సెలెబ్రేషన్ గూస్ బంప్స్.. మామ సునీల్ శెట్టి ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఇక మంత్రి స్థానంలో ఉన్న కొడాలి నాని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తండ్రి గురించి చాలా నీచంగా వ్యాఖ్యలు చేశారు. ఖర్జుర నాయుడు, లవంగం నాయుడు అంటూ కారు కూతలు కూశాడు. లోకేష్ గురించి అయితే.. పప్పు, ముద్దపప్పు అంటూ నోరు పారేసుకున్నాడు కొడాలి. ఇక వల్లభనేని వంశీ అయితే.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి అత్యంత దిగజారిన వ్యాఖ్యలు చేశారు. మరో మాజీ మంత్రి రోజా అయితే.. రెండు రోజుల క్రితం కూడా.. ఆడంగి వెధవలు అంటూ తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి దగ్గర రోడ్డుపై పడుకుని నోరు పారేసుకున్నారు. ఇక వైసీపీ అండతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. అవి బూతులు కాదు బాబోయ్.. తాగుబోతులు, తిరుగుబోతులు కూడా ఆ తరహా వ్యాఖ్యలు వింటే.. చీ చీ అనాల్సిందే. హ్యాంగర్‌కు ఉన్న షర్ట్ ఏసుకుని వస్తే.. నా కొడకల్లారా.. తలకాయలు లేచి పోతాయి.. అంటూ చేసిన వ్యాఖ్యలు సజ్జల రామకృష్ణారెడ్డికి వినిపించలేదేమో.

Also Read :వరుస ప్రమాదాలకు కారణాలేమిటి..?

ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి సారధ్యంలో ఐదేళ్ల పాటు నలిగిపోయిన సోషల్ మీడియాలో వైసీపీ సైకోలు చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ఫేక్ పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు.. ఇలా ఒకటేమిటి.. లెక్కలేనన్ని… చివరికి జగన్ తల్లి, చెల్లి విజయలక్ష్మి, షర్మిల, సునీత పైన కూడా నీచంగా పోస్టులు పెట్టారు. అది కూడా భారతీ రెడ్డి పీఏ వర్రా రవీందర్ రెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలు అయితే అబ్బో.. చెప్పలేనివి.. రాయలేంటే మాకే సిగ్గుగా ఉంది. అంత నీచంమైన కామెంట్లు చేశాడు వర్రా. ఇలాంటి వారంతా ఉన్నది వైసీపీలోనే. ఈ విషయాలు ఏవీ సజ్జలకు గుర్తు లేవా. లేక అల్జీమర్స్ వ్యాధి ఏమైనా వచ్చిందా. ఎందుకంటే.. వైసీపీలో ఇప్పటికే పోసాని వంటి నేతలను పోలీసులు అరెస్టు చేసింది నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేసిన కేసులోనే కదా. మరి మా పార్టీలో అలాంటి వారు లేరు.. మా పార్టీ అలాంటి వారిని ఎంకరేజ్ చేయదు అని సజ్జల చెప్పడం చూస్తుంటే.. ఇటీవల వచ్చిన నైంటీస్ ఎపిసోడ్‌లో సాంప్రదాయని.. సుప్పిని.. సుద్దపూసను.. అనే మాట సరిగ్గా సరిపోతుంది. గురివింద మాదిరిగా తన వెనుక ఉన్న నలుపును దాచిపెడుతున్న సజ్జల.. ఎదుటి వారిపై మాత్రం నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్